వీడియో కాన్ఫరెన్స్ : ప్రధాని నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ !

Update: 2020-04-27 07:30 GMT
కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌ డౌన్ గడువు‌ మే 3తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం దేశమంతా ఉత్కంఠ రేపుతోంది. దేశంలో ఇంకా కరోనా ఉదృతి పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడగించాలని మోడీని కోరారు. మరోవైపు దేశ వ్యాప్తంగా రోజురోజుకూ కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య  పెరుగుతుండటంతో  ప్రధాని మోదీ లాక్‌ డౌన్‌ పై ఎలాంటి నిర్ణయంపై తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ఈ సమావేశంలో భాగంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని సమాచారాన్ని సేకరిస్తూనే వారి నుంచి సూచనలు సలహాలు తీసుకుంటున్నారు. 

అయితే కరోనా మహమ్మారి‌ తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం ప్రాంతాల వారిగా సడలింపు ఇస్తుందని తెలుస్తోంది. మరికొన్ని సేవలకు సడలింపు ఇస్తూనే లాక్ ‌డౌన్‌ ను కఠినంగా అమలు చేసేలా కేంద్రం ఆలోచన చేస్తోంది. దీనిలో భాగంగానే వైరస్‌ వ్యాప్తి అధికంగా ప్రాంతాల్లో ఆంక్షలను మరింత కఠినతరం చేసి కేవలం నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బస్సులు - ట్యాక్సీలు పరిమిత వేళల్లో తక్కువ మందితో తిరగడానికి అనుమతి ఇస్తారనే అభిప్రాయం వెలువడుతుంది.

ఇక, తెలంగాణ - మహారాష్ట్ర - ఢిల్లీ - రాజస్తాన్‌ - తమిళనాడు లాంటి రాష్ట్రాలు మాత్రం మరో రెండు వారాల పాటు లాక్‌ డౌన్ ను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు అని తెలుస్తుంది.   తాజాగా జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్‌ లో ఈ అంశంపై ప్రముఖంగా చర్చ నడుస్తుంది అని తెలుస్తుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ ‌డౌన్ ‌ను ఎత్తివేస్తే తీవ్ర అనార్థాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు లాక్‌ డౌన్‌ కొనసాగింపుకే మోదీ మొగ్గుచూపుతారని తెలుస్తోంది. మరో వైపు ప్రజల ప్రాణాల్ని కాపాడుకుంటూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి వివిధ దేశాలు అనుసరించిన విధానాల్ని కూడా పరిశీలిస్తోంది. అన్ని విషయాలని పరిగణలోకి తీసుకోని , నిపుణలతో చర్చించి లాక్ డౌన్ పై మోడీ ఒక ప్రకటన చేస్తారని తెలుస్తుంది.
Tags:    

Similar News