వాస్తవాధీన రేఖ వద్ద చైనా తో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదీ లఢక్ పర్యటన కు పూనుకున్నారు. లడాఖ్ లో తాజా పరిస్థితిని అంచనా వేసేందుకు మోడీనే స్వయంగా రంగం లోకి దిగారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు కూడా మోడీ పర్యటన కు సంబంధించిన సమాచారం తెలియదంటే.. ఆయన ఎంత హఠాత్తు గా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనేది అర్థం చేసుకోవచ్చు. లేహ్ చేరుకున్న వెంటనే ఆయన 14 కార్ప్స్ సైన్యాధికారుల తో సమావేశం అయ్యారు. లడాఖ్ లో ఏం చేయాలనే దాని పై మోడీ రక్షణ శాఖ అధికారుల తో చర్చించారు.
ఆ తరువాత నరేంద్ర మోదీ లడఖ్ లో భారత సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. గల్వాన్ ఘర్షణ లో అమరులైన వీరులకు మరో సారి నివాళి అర్పిస్తున్నా. దేశమంతా మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతోంది. 14 కార్ప్స్ శౌర్య పరాక్రమాల గురించి యావత్ దేశ మాట్లాడుకుంటోంది. ఈ భూమి 130 కోట్ల ప్రజలకు ప్రతీక. విచ్ఛిన్న శక్తుల కుట్రలను లద్దాఖ్ ప్రజలు తిప్పి కొట్టారు. ఈ వీర భూమి. వీరులను కన్నభూమి. మన సంకల్పం హిమాలయాల కన్నా ఎత్తైనది. భారత శత్రువులు మీ ఆగ్రహా వేశాలను కళ్లారా చూశాయి. వేల సంవత్సరాల నుంచి ఎన్నో దాడులను తిప్పికొట్టాం. ఇవాళ మన శక్తి సామర్థ్యాలు అజేయం. జల, వాయు, పదాతి, అంతరిక్షం లో మనం శక్తివంత గా ఉన్నాం. వేణు గానం తో ఓలలాడించిన శ్రీకృష్ణుడ్ని ప్రార్థిస్తాం, అదే సమయం లో సుదర్శన చక్రం ధరించి శత్రుసంహారం చేసిన శ్రీకృష్ణుడ్ని కూడా ఆరాధిస్తాం. భారతమాత శత్రువులకు ఇప్పటికే ఆవేశాగ్ని రుచిచూపించారు. మీ సంకల్ప శక్తి హిమాలయాల అంతటి సమున్నతమైంది. యావత్ జాతి మిమ్మల్ని చూసి గర్విస్తోంది" అంటూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు