కరోనా రెండో డోస్ టీకాను ప్రధాని నరేంద్ర మోడీ వేసుకున్నారు. మొదటిసారి టీకా వేసుకున్న 39 రోజుల తర్వాత ఆయన మరోసారి ఢిల్లీలోని ఎయిమ్స్ కు చేరుకున్నారు. ఆయనకు తొలిసారి టీకా వేసిన సిస్టర్ నివేదిత ఆధ్వర్యంలోనే మోడీకి రెండోసారి టీకా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అయితే.. ప్రధానికి రెండో దఫా వ్యాక్సిన్ వేసే అవకాశం మాత్రం పంజాబ్ కు చెందిన నిషా శర్మకు దక్కటం గమనార్హం.
పుదుచ్చేరికి చెందిన నివేదా ఆధ్వర్యంలోనే మొదటిసారి టీకాను మోడీకి వేశారు. ప్రధాని మోడీకి టీకా వేసే అవకాశం రావటం జీవితంలో ఎప్పటికి గుర్తుండిపోయే క్షణాలుగా టీకా వేసిన నిషా పేర్కొన్నారు. ‘ఎప్పటికి గుర్తుండిపోయే క్షణాలు. ప్రధాని నాతో మాట్లాడారు. ఆయన్ను కలిసే అవకాశం వచ్చింది’ అని ఆమె చెప్పారు.
ఇక.. నర్సు నివేద మాట్లాడుతూ.. మోడీకి కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తానే వేసినట్లు గుర్తు చేశారు. మరోసారి ఆయన్ను కలిసే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందని.. మోడీ తమతో సరదాగా మాట్లాడారని.. తాము ఫోటోలు కూడా దిగినట్లుగా పేర్కొన్నారు.