పోలెండ్ జావెలిన్ త్రోయర్ మరియా అండ్రెజెక్. తన గొప్ప మనసు చాటుకుంది. తన ఒలింపిక్ పతకం కంటే.. పసివాడి ప్రాణాలే ముఖ్యమని భావించింది. ఏకంగా టోక్యోలో తాను సాధించిన రజత పతకాన్నే వేలానికి పెట్టింది. ఇటీవలే ముగిసిన విశ్వక్రీడల మహిళల జావెలిన్ త్రోలో మరియా 64.61 మీటర్లు విసిరి రజతం దక్కించుకుంది. స్వదేశం చేరుకున్న తర్వాత ఆ సంబరాల్లో మునిగింది.
అయితే, తన దేశానికి చెందిన ఎనిమిది నెలల బాలుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని.. ఆ చిన్నారి చికిత్స కోసం భారీగా డబ్బు అవసరమనే విషయం మరియా చెవిన పడింది. కానీ, తన వద్ద అంత సొమ్ము లేకపోవడంతో.. బాలుడి కోసం ఏకంగా తన ఒలింపిక్ పతకాన్ని వేలానికి ఉంచింది. తద్వారా లభించిన విరాళాలను ఆ బాలుడి చికిత్సకు ఇవ్వాలని సంకల్పించింది. వెంటనే ఫేస్‌బుక్‌లో విషయాన్ని తెలిపి.. తన మెడల్‌ను వేలానికి పెట్టింది.
దీంతో, చైన్ మార్కెటింగ్ కంపెనీ జబ్కా పోల్స్‌కా వేలంలో రూ.92,83,750కు పతకాన్ని సొంతం చేసుకుంది. కానీ, మరియా గొప్ప మనసును అర్థం చేసుకున్న సదరు కంపెనీ.. ఒలింపిక్ మెడల్‌ను ఆమెకు తిరిగిచ్చేసింది. మరియా పెద్ద మనసుకు చలించిపోయిన జాబ్కా యాజమాన్యం అభినందనలు తెలిపింది. అంతేకాదు.. ఆ డబ్బును బాలుడి వైద్య ఖర్చులకు అందజేస్తామని హామీ ఇచ్చింది. కాగా, మిలోజ్ మాలిసా అనే ఎనిమిది నెలల చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది.
చిన్నారికి అమెరికాలో చికిత్స అందిస్తున్నారు. ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. అయితే, పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అయ్యింది. అంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో.. మిలోజ్ తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా సాయం చేయాలంటూ దాతలను వేడుకున్నారు. శస్త్ర చికిత్స చేయకపోతే.. చనిపోయే ప్రమాదం ఉందంటూ బోరున విలపించారు. వీరి అభ్యర్థనకు ఒలింపిక్స్ మెడల్ విన్నర్ మరియా చలించింది. నిధుల సమీకరణకు ప్రయత్నించింది. ఇందులో భాగంగానే ఆమె తాను సాధించిన మెడల్‌ను వేలం వేసింది. ఇక మరియా అభిమానులు సైతం ఆమెకు బాసటగా నిలిచారు.