పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా ఏపీ ప్రభుత్వం భావించిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు.సోమవారం సోము వీర్రాజు , బీజేపీ నాయకుల బృందంతో కలిసి పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు.
'గత ప్రభుత్వం మాదిరిగానే పోలవరం కూడా ఏటీఎం అని ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది' అని సోము వీర్రాజు ఆరోపించారు.ఇదివరకే ప్రధాని నరేంద్రమోడీ సైతం గత సీఎం చంద్రబాబునాయుడుపై ఇలాంటి విమర్శలే చేశారు. ఇప్పుడు సోము వీర్రాజు సైతం ఆ ఆరోపణలను అందిపుచ్చుకున్నారు.
పోలవరంను పూర్తి చేయాలనే ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందని.. సమయాన్ని, నిధులను వృథా చేస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. పోలవరం ఖర్చులను సరిగ్గా అంచనావేయడం లేదని.. కేంద్రం నుంచి దీనికి సంబంధించిన నిధులను పొందడానికి బదులుగా.. ఎప్పుడూ అంచనాలు పెంచుతూ ఏటీఎంలా వాడుకుంటున్నారని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ గురించి మాట్లాడడం.. ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు.
పోలవరం ముంపు బాధితులను ఆదుకోవడంలో.. వారికి పునరావాసం కింద ఒక ప్యాకేజీని ఇవ్వడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. 'ఇది సరైనది కాదు.. అవసరమైతే ఖాళీగా ఉన్న వారికి పూర్తి న్యాయం జరిగే వరకు బీజేపీ ఒక ఉద్యమం చేపడుతుందని.. ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వంలోని పెద్దల వద్దకు తీసుకెళతామని వీర్రాజు స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ కోసం కేంద్రం 11000 కోట్ల రూపాయలు ఇచ్చిందని.. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆనకట్ట నిర్మాణానికి రూ.7వేల కోట్లు, తరలిస్తున్న వారికి రూ.4వేల కోట్లు ఖర్చు చేసినట్లు వీర్రాజు పేర్కొన్నారు. ఇప్పటి నుంచి కేటాయించిన డబ్బులన్నింటినీ ఆనకట్ట నిర్మాణానికి.. నిర్వాసితుల పునరావాసానికి సమానంగా విభజించాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేస్తోంది. అని సోము వీర్రాజు తెలిపారు.