ఇక‌.. చేతులు క‌ట్టుకున్న దాన్నే క‌వ‌ర్ చేయాలి

Update: 2017-10-06 12:32 GMT
వివాదాస్ప‌ద సాధ్వీ రాధేమా పుణ్య‌మా అని ఒక పోలీసు అధికారి అడ్డంగా బుక్ కావ‌టం తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని ఒక పోలీస్ స్టేష‌న్‌ను రాధేమా పావ‌నం చేయ‌టం.. ఈ సంర‌ద్భంగా సాధ్వీని చూసిన స‌ద‌రు పోలీసు అధికారికి విన‌యంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. వంగి వంగి విధేయ‌త‌త‌తో ఉండ‌టం.. త‌న కుర్చీని రాధేమాకు ఇచ్చేసి భ‌క్తిభావంతో ఒద్దిక‌గా ఉన్న ఫోటో బ‌య‌ట‌కు వ‌చ్చి వైర‌ల్ కావ‌టం తెలిసిందే.

పోలీస్ స్టేష‌న్‌ కు వ‌చ్చి పోలీసు అధికారి సీట్లో రాధేమా కూర్చున్న ఫోటోపై తీవ్ర‌స్థాయిలో రచ్చ మొద‌లైంది. పోలీస్ స్టేష‌న్‌ కు వ‌చ్చి రాధేమా అలా ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు? అంటూ ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు వేయ‌టం తెలిసిందే. సోష‌ల్ మీడియా పెద్ద ఎత్తున గొడ‌వ జ‌రిగిన ఈ ఉదంతంపై.. ఈ ఇష్యూలో అడ్డంగా బుక్ అయి.. స‌స్పెండ్ అయిన పోలీసు అధికారి రియాక్ట్ అయ్యారు. రాధేమా కుర్చీలో కూర్చోవ‌టానికి త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని వాదిస్తున్నాడు.

తాను బాత్రూంకు వెళ్లి వ‌చ్చేస‌రికి త‌న సీట్లో రాధేమా కూర్చుంద‌న్నారు. ఆమెకు మ‌ర్యాద ఇవ్వాల‌న్న ఉద్దేశంతో తానేమీ మాట్లాడ‌లేద‌న్నాడు.

ఇదిలా ఉంటే.. ఈ ఇష్యూ మీద రాధేమా మ‌రోలా రియాక్ట్ అయ్యారు. తాను స్టేష‌న్ కు వెళ్ళిన త‌ర్వాత కుర్చీ ఖాళీగా ఉండ‌టంతో తాను కూర్చున్నానే త‌ప్పించి.. ఢిల్లీ పోలీసుల్ని అవ‌మానించ‌టం త‌న ఉద్దేశం కాద‌న్నారు. ఇలా ఎవ‌రికి వారు త‌మ త‌మ వాద‌న‌ల్ని వినిపిస్తున్న వేళ‌.. ఈ ఇష్యూపై ప‌లు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు తెల్తుతున్నాయి. స‌స్పెండ్ అయిన పోలీసు అధికారి సంజ‌య్ శ‌ర్మ విష‌యానికి వ‌స్తే.. బాత్రూంకు వెళ్లి  వ‌చ్చేస‌రికి రాధేమా త‌న సీట్లో వ‌చ్చి కూర్చుందంటూ క‌వ‌ర్ చేస్తున్న ఆయ‌న‌..మ‌రి త‌న మెడ‌లో ఉన్న ఎర్ర‌టి కండువా? త‌న చేతులు రెండూ భ‌క్తిభావంతో దండం పెట్ట‌టం లాంటివి కూడా ఎందుకు పెట్టిన‌ట్లు? మ‌రి.. దీనికి ఎలాంటి భ‌క్తి కోణాన్ని తెర మీద‌కు తీసుకొచ్చి క‌వ‌ర్ చేస్తారో చూడాలి.
Tags:    

Similar News