గతంలో బ్యానర్లతో హడావుడి చేసే వారు. ఇప్పుడా స్థానాన్ని ఫ్లెక్సీలు పూర్తిగా భర్తీ చేస్తున్నాయి. ఖర్చు తక్కువ.. ప్రచారం ఎక్కువ అవకాశం ఉన్న ఫ్లెక్సీలతో ప్రచారం చేయటం.. చిన్న చిన్న కార్యక్రమాలకు భారీగా ఏర్పాటు చేయటం ఈ మధ్యన ఒక అలవాటుగా మారింది. ఫ్లెక్సీలతో ప్రచారం చేసుకుంటున్న ఒక రౌడీ షీటర్ కు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. పుట్టిన రోజు సందర్భంగా అమలాపురంలోని ఒక రౌడీ షీటర్ కు బర్త్ డే విషెష్ చెబుతూ ఆయన అనుచర వర్గం భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. దీనిపై కన్నెర్ర చేసిన అమలాపురం పోలీసులు.. ఆ రౌడీ గ్యాంగ్ కు బిత్తరపోయే షాక్ ఇచ్చింది.
అమలాపురం పట్టణంలో పలు రౌడీ గ్యాంగులు ఉన్నాయి. వాటిల్లో ఒకటైన కొలగాని స్వామినాయుడు అలియాస్ నాయీడు బ్యాచ్ ఒకటి. శనివారం ఇతగాడి పుట్టినరోజు సందర్భంగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో.. చిర్రెత్తుకొచ్చిన అమలాపురం పోటీసులు.. రివర్స్ గేర్ లో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ‘
‘రౌడీ షీటర్ గారు శ్రీ కొలగాని నాయుడుగారు.. ఇట్టు అమలాపురం పోలీసు’’ అని రాసి.. అతగాడి భారీ ఫోటోను ప్రింట్ చేశారు. ఫోటో పక్కనే క్రికెట్ బంతి.. దానికి ఎదురుగా రక్తంతో ఉన్న కత్తి ఫోటోను ముద్రించారు. కొలగాని నాయుడు బ్యాచ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో పోలిస్తే.. అమలాపురం టౌన్ పోలీసులు పెట్టిన ఫ్లెక్సీ చిన్నదే కానీ.. ఎఫెక్ట్ మాత్రం భారీగా ఉంది. గొప్పల కోసం భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. అందుకు షాక్ ట్రీట్ మెంట్ గా అమలాపురం పోలీసులు ఏర్పాటు చేసిన రివర్స్ ఫ్లెక్సీ పట్టణ ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించటంతో పాటు.. రౌడీ గ్యాంగ్ కు చెంపపెట్టుగా మారింది.