మనిషి రూపంలో కనిపించే రాక్షసుడిగా గ్యాంగ్‌స్టర్ నయింను పలువురు అభివర్ణిస్తుంటారు. కొందరు పోలీసులు.. రాజకీయ నేతల అండ చూసుకొని చెలరేగిపోవటమే కాదు.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా బెదిరింపుల పర్వానికి తెర తీసిన నయిం కిరాతకాలు అతడు చనిపోయిన ఏడాది తర్వాత కూడా బయటకు వస్తున్నాయి. తాజాగా.. తన సొంత బావ నదీమ్‌ను ఎంత దారుణంగా హత్య చేసిన విషయం బయటకు వచ్చింది.
ఈ ఎపిసోడ్ గురించి తెలిస్తే.. కరుడుగట్టిన కిరాతకుడు నయిం మాత్రమే కాదు.. అతడి ఫ్యామిలీ మొత్తమన్న భావన కలగటం ఖాయం. దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం (2013 ఫిబ్రవరి 2) శంషాబాద్ మండలం పెద్ద తూప్ర గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో సగం కాలిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినా.. ఈ కేసు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
ఆ మధ్యన నయిం మేనకోడలు సాజిదా షహీన్ అలియాజ్ సజ్జు అలియాస్ తానియా.. ఆమె భర్త మహ్మద్ అబ్దుల్ ఫహీమ్ అలియాస్ తైమూర్ అలియాస్ సలీమ్ లు రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరిని విచారించారు. ఈ సందర్భంగా నయిం దారుణాలతో పాటు.. అతగాడి ఫ్యామిలీ నేర చరిత్రను బయటపెట్టారు. ఈ సందర్భంగా నయిం బావ హత్య గురించి చెప్పిన వైనం విచారణ అధికారులకు సైతం షాకింగ్ గా మారినట్లు చెబుతున్నారు. వారి చెప్పిన వివరాల ప్రకారం చూస్తే..
తనకు సంబంధించిన వివరాలు.. నేరాల చిట్టా బయటకు తెలుస్తుందన్న ఉద్దేశంతో తల్లి ఆదేశంతో నయిం తన సొంత బావను కిరాతకంగా హత్య చేసిన వైనాన్ని వారు చెప్పుకొచ్చారు. 2013లో నయిం శంషాబాద్ లో సీక్రెట్ గా ఉండేవాడు. ఫ్యామిలీతో కలిసి పప్పూ హౌస్ లో ఉండేవాడు. ఈ క్రమంలో నయిం అక్క సలీమాకు.. భర్త విజయ్ కుమార్ అలియాస్ నదీమ్ కు విభేధాలు వచ్చాయి. మతం మారి పెళ్లి చేసుకున్నప్పటికీ సలీమా తనను నిర్లక్ష్యం చేయటాన్ని నదీమ్ తట్టుకోలేకపోయాడు. దీంతో.. నయిం నుంచి తాను బయటకు వెళ్లిపోయి బతకాలనుకున్నాడు. అదే విషయాన్ని నయింకు చెప్పాడు.
మాట్లాడుకోవటానికి అంటూ బావను పిలిచాడు నయిం. ఆ టైంలో నయింతో పాటు అతడి భార్య హసీనా.. అక్క సలీమా.. తల్లి తాహేరాబేగం.. మేనకోడలు సాజిదా.. ఆమె భర్త ఫహీమ్.. నయిం సంరక్షకురాలు ఫర్హానా ఉన్నారు. మొదట మామూలుమాటలయ్యాక అసలు విషయం రావటం.. ఆ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో.. నయిం.. అతని కుటుంబ సభ్యులంతా కలిసి నదీమ్‌ను చితక్కొట్టేశారు. ఈ టైంలోనే.. నదీమ్ ను చంపేయాలని..బయటకు వెళితే తమ రహస్యాలు బయటకు పొక్కే ప్రమాదం ఉందని నయిం తల్లి ఆదేశించటంతో భార్య చున్నీ తీసుకొని బావ మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహం ఆచూకీ తెలీకుండా ఉండేందుకు వీలుగా కారులో శంషాబాద్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చారు. ఈ ఎపిసోడ్ ను చూస్తే కిరాతకంగా వ్యవహరించటం నయింకు మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తానికే ఉందన్న విషయం అర్థం కాక మానదు.