విపక్షానికి చెందిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక కార్యక్రమాన్ని చేపడుతుంటే.. దాన్ని అడ్డుకోవటం.. బలవంతంగా అరెస్టు చేయటం లాంటి హైడ్రామా అవసరమా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ గళం విప్పొద్దన్నట్లుగా ధోరణి ఉందన్న ప్రతికూల భావన ప్రజల్లోకి వెళ్లటం తప్పించి సాధించేది మరింకేమైనా ఉందా? మరీ విషయాల్ని తెలంగాణ అధికారపక్షం ఎందుకు మరిచిపోతోంది? చూస్తూ.. చూస్తూ.. ప్రజల్లో తమకు ఆదరణ పెరుగుతోందని.. మైలేజీ వస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత.. ఏ పార్టీ అయినా ఊరికే ఉంటుందా? మరీ.. విషయాల్ని తెలంగాణ అధికారపక్షం ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదన్నది ప్రశ్న.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ.. ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన జీవో 317నున సవరించాలని కోరుతూ బీజేపీ చేపట్టిన జాగరణ దీక్ష.. ఊహించని మలుపులు తీసుకుంది. తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి కారణమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవటంతో మొదలైన ఈ రచ్చ.. ఆదివారం రాత్రి వేళ కరీంనగర్ లో తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసింది.
జాగరణ దీక్షకు అనుమతి లేదంటూ బండి సంజయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి తనదైన ప్రయత్నాలతో బండి సంజయ్ బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. తాళం వేసుకొని దీక్ష షురూ చేశారు. దాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు పెద్ద ఆపరేషన్ నిర్వహించారు. జాగరణ దీక్షకు మద్దతుగా జిల్లాల నుంచి వస్తున్న నేతల్ని ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించటం..ఈ సందర్భంగా లాఠీ చార్జి చేయాల్సి రావటం.. పలువురికి గాయాలు కావటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వ్యూహాత్మకంగా వ్యవహరించి.. పార్టీ కార్యాలయానికి చేరిన బండి సంజయ్.. తాను లోపలకు వెళ్లగానే పార్టీ ఆఫీసుకు తాళం వేసేశారు. దీంతో ఆయన జాగరణ దీక్ష మొదలైంది. తాము అనుమతి ఇవ్వకుండానే దీక్ష జరగటాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. కార్యకర్తల్ని చెదరగొట్టేందుకు లాఠీల్ని ప్రయోగించారు. అనంతరం పార్టీ కార్యాలయ గేటు తాళాన్ని పగలగొట్టారు. లోపలకు వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో.. లోపల ఉన్న పార్టీ శ్రేణులు తమ నాయకుడ్ని అరెస్టు చేస్తే.. పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంటామని హెచ్చరించారు.
దీంతో ఫైరింజన్ ను తప్పించి.. కార్యాలయం లోపల నీళ్లుచల్లారు. రాత్రి 10.30 గంటల వేళలో పార్టీ కార్యాలయ గేటు దాటి.. తలుపులు.. అద్దాలు పగలకొట్టి లోపలకు వెళ్లి బండి సంజయ్ ను బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ క్రమంలో బండిసంజయ్ తలకు గాయమైనట్లుగా పార్టీ వర్గాలు మండిపడుతున్నారు. ఆయన్ను మానకొండూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లగా.. అక్కడే ఆయన దీక్ష కొనసాగిస్తున్నట్లుగా చెబుతున్నారు. బండి సంజయ్ అరెస్టుపై పార్టీ నేతలు పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
సంజయ్ అరెస్టు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని.. బండి సంజయ్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీ అని.. కనీస గౌరవం లేకుండా గేటు విరగ్గొట్టి లోపలకు వెళ్లటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఫైర్ అయ్యారు. మొత్తంగా బండి సంజయ్ చేస్తున్న దీక్షను విరమించటానికి పోలీసులు ఇంత భారీ హైడ్రామానుచేపట్టాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.