ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడంపై నెలకొన్న గందరగోళంతో రిసార్ట్స్‌కు చేరిన తమిళనాడు రాజకీయాల వలే నాగాలాండ్‌లో కూడా రిసార్ట్ రాజకీయాలకు తెరలేచింది. సీఎం గద్దె కోసం ముగ్గురు పోటీ పడుతుండగా, అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రం దాటిపోయి అసోంలోని ఓ రిసార్ట్ లో డేరా వేసేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జేలియాంగ్ గద్దె దిగేందుకు ఒప్పుకున్నారు. ఆయన స్థానంలోపార్టీ అధ్యక్షుడు షుర్హోజెలీ లైజీట్జును తొలుత తమ నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు రాష్ట్రంలోని ఏకైక ఏంపీ నేఫియు రియో వైపు మొగ్గు చూపుతున్నారు. నాగాలాండ్ నాటకాన్ని కూడా కేంద్రమే నడిపిస్తున్నట్టు స్థానిక పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి
మరోవైపు నాటకీయ పరిణామాల మధ్య నాగాలాండ్ ముఖ్యమంత్రి టిఆర్ జెలియాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానే మాజీ ముఖ్యమంత్రి నైఫూ రియో పగ్గాలు చేపట్టనున్నారు. పాలక నాగాలాండ్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్ ఎడి)కి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు పొరుగు రాష్ట్రమైన అస్సాంలోని రిసార్ట్ లో మకాం వేసి ముఖ్యమంత్రి జెపలియాంగ్ ను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదిపారు. పురపాలక సంఘాల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న జెలియాంగ్ ప్రభుత్వ నిర్ణయాన్ని నాగా ట్రైబల్ యాక్షన్ కమిటీ (ఎన్ టిఎసి) తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేసింది. తమిళనాడు తరహాలో ఇప్పుడక్కడ క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రిగా జెలియాంగ్ ను తొలగించి తాను ఆ కుర్చీ ఎక్కాలని చూసిన నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్(ఎన్ పిఎఫ్) పార్టీ అధ్యక్షుడు షురోజెలి లిజెషు యత్నాలను 34 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. లిజెషు చర్యలను నిరసిస్తూ కజరంగా పార్క్ లోని అయోరా రిసార్ట్ లో మకాం వేశారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో వున్న జెలియాంగ్, రియోలు అస్సాంలోని అయోరా రిసార్ట్ కు చేరుకుని వీరితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సిఎం పదవి నుంచి జెలియాంగ్ తప్పుకుని రియోకు పగ్గాలు ఇచ్చేందుకు అంగీకరించారు. గవర్నర్ పీబీ ఆచార్య రాష్ట్రానికి తిరిగివచ్చిన వెంటనే రియో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా రియో ప్రభుత్వానికి తమ మద్దతు వుంటుందని ప్రకటించారు.రియో 2014లో ఎంపీగా ఎన్నికై జాతీయ రాజకీయాల్లోకి వెళ్లగా ముఖ్యమంత్రి పదవిని జెలియాంగ్ చేపట్టారు. తరువాత ఆయనను ఎన్ పిఎఫ్ నుంచి బహిష్కరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/