కామ లో ఏ పార్టీ వారు ఎంతమందంటే..?

Update: 2015-12-17 05:44 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న కాల్ మనీ వ్యవహారంలో సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అత్యధిక వడ్డీలకు అప్పులిచ్చి.. వాటిని సకాలంలో తీర్చకపోతే.. అప్పు తీసుకున్న ఇంటి మహిళల్ని బలవంతంగా వ్యవభిచారంలోకి దింపటం.. వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే దుర్మార్గమే కామాగా చెప్పుకునే కాల్ మనీ వ్యవహారం. ఏపీ తాత్కలిక రాజధాని విజయవాడలో ఉన్న ఈ దందా గురించి కొద్దిరోజుల క్రితం బయటకు రావటం.. ఇదో సంచలనంగా మారింది.

పనిలోపనిగా.. ఈ అంశంపై రాజకీయ పార్టీలు ఎంట్రీ ఇవ్వటం.. కామ వ్యాపారంలో రాజకీయ పార్టీ నేతల భాగస్వామ్యం ఉండటంతో వాతావరణం మరింత వేడెక్కింది. అధికారపక్షం విపక్షాల మీద.. విపక్షాలు అధికారపక్షం మీదా విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో.. అసలు ఏ పార్టీకి చెందిన వారు ఎంతమంది ఉన్నారన్న సందేహం పలువురికి కలుగుతోంది. విజయవాడలో వెలుగుచూసిన కామ లో పార్టీల వారీగా సంబంధాలు చూస్తే.. ఇప్పటివరకూ మొత్తం ఈ దుర్మార్గపు వ్యాపారానికి సంబంధించి 118 కేసులు నమోదు చేశారు.

వీరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్న వారు 44 మంది ఉంటే.. తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉన్న వారు 20 మందిగా తేలింది. ఇక.. కాంగ్రెస్ తో 13 మంది.. సీపీఐతో ఆరుగురు.. ఏపార్టీకి సంబంధం లేని వారు 35 మందిగా తేల్చారు. అంటే..కాస్త కుడి ఏడంగా.. అన్ని పార్టీలకు ఈ పాపంతో లింకులు ఉన్నట్లేనన్న మాట.
Tags:    

Similar News