తెలంగాణ రాష్ట్ర ఓటర్లు రికార్డు సృష్టించారు. గతంలో ఎన్నడూ లేనంతగా తాజా ఎన్నికల్లో రికార్డుస్థాయి పోలింగ్‌ను నమోదు చేశారు. అయితే, ఎప్పట్లాగే ఇందులో గ్రామీణ ప్రాంత ఓటర్లు అత్యంత చైతన్యం ప్రదర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్లు మాత్రం నిర్లిప్తంగా ఉండిపోయారు. రాష్ట్రంలోని 74 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 70%పైగా పోలింగ్ నమోదుకాగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 సెగ్మెంట్లలో 50 శాతానికి మించకపోవడం గమనార్హం. సుదీర్ఘ కసరత్తు తర్వాత తుది వివరాలను ఎన్నికల కమిషన్ శనివారం వెల్లడించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సగటున 73.2% పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు. గతంలో ఎన్నడూ ఈస్థాయిలో పోలింగ్ నమోదుకాలేదని పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు. 2014 ఎన్నికలతో (69.5%) పోలిస్తే.. ఈసారి సుమారు 3.70% మేర పోలింగ్ పెరిగిందని రజత్‌కుమార్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో నివసించే గ్రామీణ ఓటర్లు పట్టుబట్టి.. జట్టుకట్టి.. పల్లెలకు బైలెల్లి మరీ తమ ఓటు హక్కును అక్కడ వినియోగించుకోవడం విశేషం.
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ వివరాల ప్రకారం....ఏడు నియోజకవర్గాల్లో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలోనే 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 2009లో గరిష్ఠమే 89.10శాతంగా ఉంది. కానీ తాజా ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో అత్యధికంగా 91.65% పోలింగ్ నమోదైంది. ఆతర్వాత స్థానంలో నల్లగొండ జిల్లా ఆలేరు 91.33%, మునుగోడు 91.07%తో రెండు - మూడు స్థానాల్లో నిలిచాయి. ఖమ్మం జిల్లాలోని పాలేరులో 90.99% ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా - వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటలో 90.53% - భువనగిరిలో 90.53% ఓటర్లు ఓటేశారు. కాగా తక్కువ పోలింగ్ నమోదైన నియోజకవర్గాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే ఉండటం గమనార్హం. చార్మినార్ లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 40.18% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాల వారీగా చూసినప్పుడు అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కువ పోలింగ్ నమోదైంది. ఈ జిల్లాలోని రెండు నియోజకవర్గాలు ఆలేరు - భువనగిరిల్లో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదుకావడం విశేషం. 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైన జిల్లాల్లో.. కుమ్రంభీం ఆసిఫాబాద్ - ఆదిలాబాద్ - నిర్మల్ - కామారెడ్డి - పెద్దపల్లి - సంగారెడ్డి - రాజన్న సిరిసిల్ల - మెదక్ - సిద్దిపేట - నాగర్ కర్నూల్ - వనపర్తి - జోగుళాంబ గద్వాల - నల్లగొండ - సూర్యాపేట - యాదాద్రి భువనగిరి - జనగామ - మహబూబాబాద్, వరంగల్ రూరల్ - జయశంకర్ భూపాలపల్లి - భద్రాద్రి కొత్తగూడెం - ఖమ్మం జిల్లాలున్నాయి.
పల్లె ఓటరులో చైతన్యం వెల్లివిరిస్తే.. నగర ఓటర్లు కుదేలయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తక్కువ పోలింగ్ నమోదైంది. జీహెచ్ ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో చాలా చోట్ల 45-50% లోపు పోలింగ్ నమోదవటం గమనార్హం. ముషీరాబాద్ - మలక్ పేట - జూబ్లీహిల్స్ - నాంపల్లి - చార్మినార్ - చాంద్రాయణగుట్ట - యూకుత్ పురా - సికింద్రాబాద్ కంటోన్మెంట్ - బహదూర్ పురా నియోజకవర్గాల్లో 40నుంచి 50శాతం లోపే పోలింగ్ జరిగింది. చాలా నియోజకవర్గాల్లో ద్విముఖ పోటీ ఉండటం, మూడో అభ్యర్థి బలంగా లేకపోవడం - కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఏకపక్షంగా ఉండటంతో పోలింగ్ తగ్గిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న రాజస్థానీలు తమ స్వరాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు తరలి వెళ్లడమూ ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో గ్రేటర్ లో 53% తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సారి అంతకన్నా తక్కువగా.. అంటే 52.40% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్ ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అనేది చర్చనీయాంశమైంది.
ఎన్నికల్లో మహిళా చైతన్యం వెల్లువెత్తింది. శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో రికార్డు నెలకొల్పారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో దాదాపు మహిళలంతా ఓట్లేశారు. ఇక్కడ మహిళల ఓటింగ్ శాతం 99.74గా నమోదైంది. అతి తక్కువగా చార్మినార్ నియోజకవర్గంలో 37.95 శాతం నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 73.2 శాతం పోలింగ్ నమోదవగా - పురుషుల ఓటింగ్ శాతం 72.54.. మహిళల ఓటింగ్ శాతం 73.88గా నమోదైంది. 14 జిల్లాల్లో మహిళలు పురుషుల కంటే అధిక సంఖ్యలో ఓట్లేయడం విశేషం. థర్డ్ జెండర్స్ దాదాపు అందరూ ఓట్లేశారు. మానకొండూరు - బోథ్ - బహదూర్ పుర నియోజకవర్గాల్లో వందశాతం థర్డ్ జెండర్స్ ఓట్లు పోలయ్యాయి.
రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ నిర్వహించడం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు. కార్వాన్ లో మళ్లీ పోలింగ్ అవసరం లేదని ఈసీఐ ఆదేశించినట్టు తెలిపారు. చాలా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించామని - ఈవీఎంలను పారదర్శంగానే భద్రపర్చామని స్పష్టం చేశారు. ఫిర్యాదులనేవి ప్రతి ఎన్నికల్లో వస్తూనే ఉంటాయన్నారు. పోలింగ్ శాతాలను వివరించేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 73.20% పోలింగ్ నమోదైనట్టు చెప్పారు. గత ఎన్నికలతో పోల్చితే 3.70% ఎక్కువగా ఓటింగ్ నమోదైనట్టు చెప్పారు. భారీగా పోలింగ్ నమోదవ్వడంపట్ల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. శనివారం తెల్లవారుజామన 3.40 గంటలకు పోలింగ్ కు సంబంధించిన రిపోర్టు తమకు అందిందని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలో అత్యధికంగా 517 పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం అధికారులు పత్రాలన్నీ ఆర్వోకు సమర్పిస్తారని - ఆ పత్రాలన్నింటినీ ఆర్వో పరీక్షించడానికి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కనీసం ఐదు గంటలు పడుతుందన్నారు. పోలింగ్ శాతం విడుదల ఆలస్యం కావడానికి సాంకేతికలోపం కారణం కాదన్నారు. స్ట్రాంగ్ రూముల భద్రతపై భరోసా ఇచ్చిన రజత్ కుమార్.. ఎలాంటి అనుమానాలున్నా స్ట్రాంగ్ రూముల వద్ద పర్యవేక్షణ ఏర్పాటు చేసుకోవచ్చని అన్ని రాజకీయ పార్టీలకు సూచించారు. 2014 ఎన్నికల్లో పోలింగ్ 69.5% ఉంటే.. ప్రస్తుతం 73.20% నమోదైందని తెలిపారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనున్నట్టు చెప్పారు. ఫారం 17సీలో అన్ని వివరాలు ఉంటాయన్నారు. సీసీటీవీ పర్యవేక్షణలోనే ఈవీఎంలకు సీల్ వేసి - భద్రపరుస్తారని వివరించారు.
2009 ఎన్నికల్లో పాత ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాలు ముందు వరుసలో ఉన్నాయి. 2009లో పాలేరులో అత్యధికంగా 89.10% పోలింగ్ నమోదైంది. 2009 ఎన్నికల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైన నియోజకవర్గాలు కేవలం 11 మాత్రమే. అంటే 9.24% చోట్ల మాత్రమే 80 శాతానికి పైగా పోలింగ్ ఉంది. ఆ జాబితాలో.. సిర్పూరు 80.07% - బోథ్ 81.07% - నర్సాపూర్ 83.86% - గజ్వేల్ 84.11% - డోర్నకల్ 81.18% - నర్సంపేట 84.69% - పాలేరు 89.10% - మధిర 86.91% - వైరా 84.91% - సత్తుపల్లి 84.77% - అశ్వారావుపేట 81.62% ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 59 స్థానాల్లో అంటే దాదాపు సగం స్థానాల్లో 70-80% పోలింగ్ నమోదైంది. 22 స్థానాల్లో 60-70% - 21 స్థానాల్లో 50-60% ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో ఆరు నియోజకవర్గాలు.. ఉప్పల్ 42.32% - ఎల్బీనగర్ 47.29% - నాంపల్లి 45.68% - కార్వాన్ 47.68% - బహదూర్ పుర 48.82% - నిజామాబాద్ (పట్టణం) 39.53% పోలింగ్ నమోదైంది.