ప్రస్తుతం ఉత్తర భారత దేశం వాయుకాలుష్యంతో విలవిలలాడుతోంది. దేశరాజధాని పరిస్థితి అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. ఏకంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించే స్థాయికి అక్కడి పరిస్థితి దిగజారింది. ముందే కాలుష్యం ఎఫెక్ట్ తో అల్లాడుతున్న ఢిల్లీ వాసులు ..దీపావళి పండుగ తరువాత పూర్తిగా కాలుష్యంలో మునిగిపోయారు. దీనితో ఢిల్లీలో స్కూల్స్ కి సెలవులు ఇచ్చేసారు. అలాగే మరోసారి సరి - బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితులైతే తప్ప ..ఇంట్లో నుండి బయటకి రాకండి అని , అలాగే బయటకి వచ్చినా కూడా తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని చెప్తున్నారు.
ఇక తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసికి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. సిగ్రాలోని ప్రముఖ శివ-పార్వతీ దేవాలయంలో శివపార్వతుల విగ్రహాలకు అక్కడి పూజారులు మాస్కులు తొడిగారు. దుర్గామాతకే కాకుండా..కాళీ, మహాశివుడు,సాయిబాబా విగ్రహాలకు కూడా మాస్క్‌లు తొడిగారు. దీనిపై గుడి పూజారి మాట్లాడుతూ .. విగ్రహాలను మేం ఎదురుగా నిలబడిన దైవాలుగా చూస్తాం. చలి, గాడుపుల నుంచి మమ్మల్ని మేం ఎలా రక్షించుకుంటామో..దేవతలకు కూడా అదే విధంగా సదుపాయాలు కల్పిస్తాం అని చెప్పారు. మాములుగా అక్కడ ఎండాకాలంలో చల్లదనం కోసం విగ్రహాలకు చందనం పూస్తారు. అదే విధంగా చలికాలంలో విగ్రహాలకు స్వేట్టర్ వంటివి వేస్తారు. ఇప్పుడు కాలుష్యం పెరిగిపోవడంతో విగ్రహాలకు మాస్కులు తొడిగారు