కేవలం పరిపాలనలో సౌలభ్యం అనేది ప్రాతిపదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకున్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం 10 మంద కలెక్టర్లు పని చేస్తే తొందరగా అవుతదా? 31 మంది కలెక్టర్లు పనిచేస్తే తొందరగా అవుతదా? అనే ప్రాతిపదిక మీద ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు అవుతున్నాయి. ఇది కేవలం పరిపాలన పరమైన సౌలభ్యం కోసం జరుగుతున్న ఏర్పాటు. అంతే తప్ప దీనివల్ల ఏదో అద్భుతాలు జరిగిపోతాయని అనుకోవడం భ్రమ. అయితే కేసీఆర్ ను కీర్తించి ప్రసన్నం చేసుకోవాలని చూసే నాయకులు మాత్రం ఈ కొత్త జిల్లాల ఏర్పాటును ఒక గొప్ప సాహసంగా అభివర్ణిస్తున్నారు.
జిల్లాల ఏర్పాటు అనేది ఏ రకంగా సాహసం అవుతుందో అర్థం కావడం లేదు. జిల్లాల ఏర్పాటు వలన కొత్తగా కొన్ని ఉద్యోగాలు సృష్టి జరుగుతుందన్నది నిజం. జిల్లాలతో పాటు కొన్ని మండలాలు పెరుగుతాయి. కొన్ని రెవిన్యూ డివిజన్లు పెరుగుతాయి. ఆ దామాషాలో ప్రభుత్వ కొలువులు పెరుగుతాయి. అంతవరకు యువతరానికి శుభవార్తే. కొత్తగా తయారయ్యే ఉద్యోగాల మేర వారి వేతనాల రూపంలో ప్రభుత్వానికి అదనపు భారం పడుతుంది. అంతే తప్ప జిల్లాల ఏర్పాటులో సాహసం ఏం ఉన్నదో బోధపడడం లేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉంటూ.. గులాబీ పార్టీలోకి ఫిరాయించిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ సాహసాన్ని కీర్తిస్తూ పత్రికల్లో పెద్దపెద్ద ప్రకటనలు గుప్పించారు. గతంలో ఏ పాలకులూ తీసుకోలేని సాహసోపేత నిర్ణయం తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రశంసించారు. పరిపాలన సౌలభ్యం అనే వరకు పరవాలేదు గానీ.. జిల్లాల ఏర్పాటులో సాహసం ఏం ఉన్నదో ప్రజలకు అర్థం కావడం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/