2019 ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ఒకింత బలమైన నేతగా, బలమైన ప్రభుత్వంగా ఉన్న టీఆర్ ఎస్, సీఎం కేసీఆర్‌పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని దుయ్యబడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలకు తోడు ఇప్పుడు విద్యార్థి సంఘం, ముఖ్యంగా బీజేపీకి చెందిన నేతలు కూడా కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతున్నారు. అధికార టీఆర్ ఎస్ ఓప్రైవేటు కంపెనీగా మారిపోయిందని దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ను క్యా హువా తేరా వాదా(మీరిచ్చిన హామీలు ఏమయ్యాయి) అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు అసలు విషయాలు గ్రహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
విషయంలోకి వెళ్తే.. 'నిరుద్యోగుల సమరభేరి" పేరిట బీజేవైఎం సరూర్‌నగర్ స్టేడియంలో భారీ సభ నిర్వహించింది.ఈ సభలో బీజేవైఎం జాతీయ నేత పూనమ్ మహజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సభలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్, ఎంఐఎంలతో సీఎం కేసీఆర్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారని విమర్శించారు.తెలంగాణ బిడ్డను, ఆంధ్రా కోడలిని అంటూ కేసీఆర్ తీరును ఆమె తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన హమీలను అమలు చేయలేదని పూనమ్ గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేయకుండానే ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు.
తెలంగాణ సర్కార్ పై ఈ సభ యుద్ధ భేరి అని తెలిపారు.ఢమరుకం వాయించి సమరభేరి మోగించి కార్యకర్తలను పూనమ్ ఉత్సాహపరిచారు. పూనమ్ మహజన్ తండ్రి ప్రమోద్ మహజన్ మహబూబ్‌నగర్‌లో పుట్టారు. ఆ తర్వాత మహరాష్ట్రలో ప్రమోద్ మహజన్ గడిపారు. పూనమ్ మహజన్ వ్యాపారవేత్త ఆనంద్‌రావు వాజెండ్లను వివాహం చేసుకున్నారు. ఆనంద్‌రావు పూర్వీకులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. అధికార టీఆర్‌ఎస్ ఒక ప్రయివేట్ లిమిటెడ్ పార్టీ అని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జనవరిలో జరిగే ర్యాలీలో బైక్ పై తానే ముందుంటానని పూనమ్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.
తెలంగాణ యువకుల స్వప్నాలను కేసీఆర్ నీరుగార్చారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ఉదయం పూట కాంగ్రెస్, రాత్రి పూట ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నారని పూనమ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇస్తామని హమీ ఇచ్చిన కెసిఆర్ , తన అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. నిజాంను కేసీఆర్ పొగడటాన్ని బీజేపీ సహించబోదని స్పష్టం చేశారు. ``కేసీఆర్.. మీకు కలెక్టర్ ఆఫీస్‌లు వచ్చాయి.. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడిస్తావ్`` అని పూనం సూటిగా ప్రశ్నించారు. క్యా హువా తేరా వాదా అని బీజేవైఎం కేసీఆర్ ను నిలదీస్తుందని చెప్పారు. మొత్తానికి ఈ సభతో స్థానిక బీజేపీలో కొత్త ఉత్సాహం రావడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. అదేసమయంలో కేసీఆర్‌ను నిలదీసే కొత్త గొంతు కూడా వచ్చిందని అంటున్నారు. మరి ఉద్యమ నేత, ఆయన పరివారం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.