బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి పొందడానికి ఎన్నోఏళ్లు పోరాడి స్వాతంత్ర్యం సాధించుకున్న సంగతి తెలిసిందే. అయితే... ఇప్పుడు ఇండియా నుంచి తమకు స్వాతంత్ర్యం కావాలంటూ కొన్ని రాష్ట్రాల్లో డిమాండ్ వినిపిస్తోంది. విద్యార్థి ఉద్యమాలు - యూనివర్సిటీల్లో రగడలతో వేడెక్కుతున్న దేశంలో ఈ స్వాతంత్ర్య పోరాటం కూడా యూనివర్సిటీలో మొదలవుతుండడంతో ఇదెంతవరకు వెళ్తుందో అన్న భయం చాలామందిలో ఏర్పడుతోంది. కోల్ కతా నగరంలో ఉన్న జాదవ్ పూర్ యూనివర్సిటీలో తాజాగా వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కాశ్మీర్ - నాగాలాండ్ - మణిపూర్ రాష్ట్రాలకు స్వాతంత్ర్యం కావాలంటూ పోస్టర్లు అతికించారు. ఈ చర్యల వెనుక తీవ్రవాదులు ఉన్నట్లుగా భావిస్తున్నారు.
మణిపూర్ - నాగాలాండ్ లకు స్వాతంత్య్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జాదవ్ పూర్ యూనివర్శిటీ (జెయు) విద్యార్థులు ప్రదర్శనలు చేపట్టారు. ఇప్పటికే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థులు కాశ్మీర్ స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం ప్రదర్శన నిర్వహించడం, జాతి వ్యతిరేక నినాదాలు చేయడంతో యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిని రాజద్రోహం కింద పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఆ వివాదం ముగియకముందే జెయు విద్యార్థులు నిరసన ప్రారంభించారు. అంతకుముందు ఇక్కడి విద్యార్థులు అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేశారు. 'హమ్ క్యా చాహే.. ఆజాదీ. కాశ్మీర్ కీ ఆజాదీ, మణిపూర్ కీ ఆజాదీ, నాగాలాండ్ కీ ఆజాదీ' (మాకు స్వాతంత్య్రం కావాలి - కాశ్మీర్ స్వాతంత్య్రం - మణిపూర్ స్వాతంత్య్రం - నాగాలాండ్ స్వాతంత్య్రం) అంటూ యూనివర్శిటీలో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లన్నింటి మీదా 'రాడికల్' గ్రూపు అని సంతకం ఉంది. కాగా యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ మాట్లాడుతూ కొద్దిమంది దుండగులు ఈ పనికి పాల్పడ్డారని అన్నారు. విద్యార్థి సంఘం నేతలతో తాను మాట్లాడానని, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు తాము దూరంగా ఉన్నామని... వాటితో తమకెలాంటి సంబంధం లేదని వారు చెప్పారని ఆయన అంటున్నారు. అయితే... దేశంలోని యూనివర్సిటీల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దీన్ని పోలీసులు, ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుని విచారణ చేస్తోంది.
ఈ పోస్టర్లను ఎవరు అతికించారు... ఉగ్రవాద ప్రమేయం ఉందా లేదంటే ఉడుకురక్తంతో విద్యార్థులు చేసిన పనా అన్నది విచారణ జరుపుతున్నారు. ఏదైనా కూడా దీన్ని తేలిగ్గా తీసుకోరాదని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా మణిపూర్ - నాగాలాండ్ ప్రాంత విద్యార్థులను విచారిస్తున్నారు.