ప్రపంచం మొత్తాన్ని కదిలించిన భూకంపం, అది సృష్టించిన విలయం, ప్రలయం నుండి ఇంకా ఏ ఒక్కరూ తేరుకోకముందే మరోసారి భూమి కంపించింది! ఈ సారి ఆఫ్గాన్ కేంద్రంగా, మరో సారి నేపాల్ ను టచ్ చేస్తూ, భారత దేశాన్ని కదిలిస్తూ ఈ భూకంపం జరిగింది! ఉత్తర, ఈశాన్య భారతాన్ని ఈ భూకంపం మరోసారి వణికించింది! ఈశాన్య రాష్ట్రాలైన ఢిల్లీ, బెంగాల్, బీహార్, పాట్నా, కోల్ కతా, రాజస్థాన్, పంజాబ్, లక్నో, జైపూర్ , ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లోని పలు ప్రాంతాల్లో మంగళవారం 12.35 గంటలకు సుమారు 60 సెకన్ల పాటు భూమి కంపించింది. జియలాజికల్ సర్వే విభాగం ప్రకారం భూప్రకంపనలు రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.1 గా నమోదైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కూడా భూమి కంపించింది. వైజాగ్‌లో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భూకంపానికి భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. హిందూకుష్ నుంచి ఈశాన్య భారత్ వరకూ భూమి కంపించినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. హిమాలయా పర్వతాల్లో కూడా దీని ప్రభావం ఉంది. ఇప్పటికే నేపాల్ విషయంలో తగిలిన షాక్ నుండి తేరుకుంటున్న దశలో ఇప్పటికిప్పుడు మరో సారి భూమి కంపించడంపై సర్వత్రా భయాందోళనలు వెళ్లువెత్తుతున్నాయి!