యాంక‌ర్ ప్ర‌దీప్ క‌నిపించాడు.. ఎక్క‌డంటే..?

Update: 2018-01-05 04:26 GMT
డ్రంక్ డ్రైవ్ కేసులో దొరికిపోయిన యాంక‌ర్ ప్ర‌దీప్.. పోలీసుల ఎదుట హాజ‌రు కావాల్సి ఉన్నా.. హాజ‌రు కాని ప‌రిస్థితి. అత‌డి కోసం పోలీసులు వెతుకున్నా ఆయ‌న ఆచూకీ దొర‌క‌టం లేదు. ఆయ‌న ఇల్లు.. కార్యాల‌యం ఎక్క‌డా ఆయ‌న అందుబాటులోకి రావ‌టం లేదు. ఈ తీరుపై భారీ చ‌ర్చ జ‌రుగుతోంది. నోటీసుల్లో పేర్కొన్న గ‌డువు లోపు పోలీసుల ఎదుట హాజ‌రు కాని ప‌క్షంలో ప్ర‌దీప్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భావిస్తున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డిన వారు పోలీస్ కౌన్సెలింగ్‌ కు హాజ‌రు కావాల్సి ఉంటుంది. డిసెంబ‌రు 31 అర్థ‌రాత్రి పోలీసులు జ‌రిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసుల‌కు దొరికిపోయాడు. బ్రీత్ ఎన‌లైజ‌ర్ ద్వారా ప‌రీక్షించ‌గా 178 పాయింట్లు న‌మోద‌య్యాయి. ఇప్పుడున్న చ‌ట్టం ప్ర‌కారం ప్ర‌దీప్ కు జైలుశిక్ష త‌ప్ప‌నిస‌రి అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంఇ.

ఇదిలా ఉండ‌గా.. పోలీసుల కౌన్సెలింగ్‌ కు హాజ‌రు కావాల్సిన ప్ర‌దీప్ హాజ‌రు కావ‌టం లేదు. ప్ర‌దీప్ ఆచూకీ పోలీసుల‌కు దొర‌క‌టం లేదు. ఇలాంటి వేళ‌.. ప్ర‌దీప్ ఒక వీడియోలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. తాను ఎందుకు అందుబాటులోకి రావ‌టం లేదో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. ప్ర‌దీప్ వివ‌ర‌ణ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

తాను పోలీసుల‌కు అందుబాటులోకి రాక‌పోవ‌టానికి కార‌ణాలు చెప్పుకొచ్చాడు. వీడియోలో ఏమున్నందంటే.. "నేను మీ ప్ర‌దీప్ మాచిరాజు. డిసెంబ‌రు 31వ అర్థ‌రాత్రి ఏం జ‌రిగిందో అంద‌రికి తెలుసు. దాని త‌ర్వాత జ‌రిగే ప్ర‌తి ప్రొసీడింగ్స్ చ‌ట్ట‌ప్ర‌కార‌మే ఫాలో అవుతా. నాకు వ‌చ్చిన సూచ‌న‌ల ప్ర‌కారం పోలీస్ కౌన్సెలింగ్ కానీ.. దాని త‌ర్వాత జ‌రిగే ప్ర‌తి ప్రోసీడింగ్ కు హాజ‌ర‌య్యేందుకు సిద్ధంగా ఉన్నా.

ముందుగా క‌మిట్ అయిన ప్రోగ్రామ్స్‌.. ఇత‌ర ఈవెంట్ల షూటింగ్స్ తో బిజీగా ఉన్నా. అందువ‌ల్ల నేను అందుబాటులో లేనంటూ కొంద‌రు ఆందోళ‌న చెందుతున్నారు. తెలియ‌జేసేదేమంటే.. షూటింగ్స్ తో బిజీగా ఉండ‌టం వ‌ల్లే కౌన్సెలింగ్‌ కు హాజ‌రు కాలేదు.  అదే ప‌నిగా ఫోన్ మోగ‌టం వ‌ల్ల కొన్ని ముఖ్య‌మైన కాల్స్ మిస్ అయి ఉండొచ్చు. ద‌య‌చేసి మీడియా మిత్రుల‌కు కానీ.. ప్రేక్ష‌కుల‌కు కానీ తెలియ‌జేసేదేమంటే.. చ‌ట్ట ప్ర‌కారం అన్ని ప్రోసీడింగ్స్ ఫాలో అవుతాను. గ‌తేడాది డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఓ వీడియో గురించి చెప్పాను. అవును.. దుర‌దృష్ట‌వ‌శాత్తు నేను దొరికాను. నేను చెప్పేదేమంటే.. నేను చేసిన త‌ప్పు ఇంకెవ‌రూ చేయ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నా. అంద‌రూ న‌న్ను అర్థం చేసుకుంటార‌ని భావిస్తున్నా" అంటూ వీడియోలో త‌న సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. మ‌రి.. దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Full View
Tags:    

Similar News