దేశంలో మత అసహనం పెరిగిపోతుందంటూ కవులు..కళాకారులు.. మేధావులు.. సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అవార్డులు తిరిగి ఇస్తూ చేసిన ప్రకటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలకవ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పదవిలో ఉన్న పూర్తి స్థాయి రాజకీయ నాయకుడైన ప్రణబ్ పై.. రాష్ట్రపతి పదవిని చేపట్టే సమయంలో చాలానే ఆసక్తికర చర్చ సాగింది. ఆయన కాస్తంత స్వతంత్ర్యంగా వ్యవహరించే అవకాశం ఉందంటూ అప్పట్లో అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే.. రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న ఆయన.. సంచలన వ్యాఖ్యలు.. నిర్ణయాల జోలికి వెళ్లకుండా ఉన్నారు.
కేంద్రంలో ఉన్న ఎన్డీయేసర్కారుకు తలనొప్పిగా మారిన అవార్డు వాపసీ కార్యక్రమంపై ప్రణబ్ దా తాజాగా సీరియస్ కావటం ఆసక్తికరంగా మారింది. దేశంలో మత సహనం పెరిగిందంటూ అవార్డులు తిరిగి ఇచ్చేయటం ఏమాత్రం సరికాదని.. ప్రతిభకు గుర్తింపుగా అవార్డుల వస్తాయని.. వాటిని గౌరవంతో స్వీకరించాలన్న ఆయన.. తొందరపాటు పనికిరాదని వ్యాఖ్యానించారు.
అసమనం.. అవార్డులు తిరిగి ఇచ్చేయటం లాంటి వివాదాల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. అసమ్మతిని చర్యలు.. అభిప్రాపాల ద్వారానే వ్యక్తం చేయాలి తప్పించి.. భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు.
నేషనల్ ప్రెస్ డే సందర్భంగా జరిగిన సదస్సుకు హాజరైన ఆయన.. సున్నిత మనస్కులు కొన్నిసార్లు సమాజంలో జరిగే కొన్ని ఘటనలు చూసి ఆందోళనలకు గురి అవుతారని.. అయితే భావోద్వేఆగాలు హేతుబద్ధతను అధిగమించరాదంటూ ప్రణబ్ దా అవార్డు వాపసీపై తన వ్యతిరేకతను చెప్పేశారు. అవార్డు వాపసీపై దేశ ప్రధమ పౌరుడు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.