పీకే.. అంద‌రికీ స‌ల‌హాలు ఇస్తే.. కేసీఆర్ నాకే స‌ల‌హాలు ఇచ్చాడు!

Update: 2022-02-22 04:30 GMT
జాతీయ రాజ‌కీయాల్లో మంచి పేరున్న పొలిటిక‌ల్ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్‌(పీకే).. పార్టీల‌నాయ‌కుల‌కు స‌ల‌హాలుఇవ్వ‌డంతోపాటు. ఆయా పార్టీల‌ను ముందుండి నడిపిస్తున్న విష‌యం తెలిసిందే.

వారిని తానే గెలిపించాన‌ని.. కూడా ఆయ‌న మైలేజీ వేసుకుంటారు. అయితే.. వాస్త‌వానికి ఆయ‌న‌పై ఉన్న విమ‌ర్శ ఏంటంటే.. గెలిచే పార్టీని ముందుగా నిర్ణ‌యించుకుని.. ఆ పార్టీ త‌ర‌ఫున ఆయ‌న వ‌కాల్తా పుచ్చుకుంటార‌ని అంటారు ప‌రిశీల‌కులు.

ఎందుకంటే.. ఉత్త‌రప్ర‌దేశ్‌లో కాంగ్రెస్‌ను గెలిపించాల‌ని ఆ పార్టీ నేత‌లు పీకేను మొద‌ట్లో సంప్ర‌దించారు. అప్ప‌ట్లో బెంగాల్ విజ‌యంతో మంచి హుషారుగా ఉన్న పీకే.. దీనికి ఓకే కూడా చెప్పారు. కానీ, త‌ను చేయిం చుకున్న ప‌ర్స‌న‌ల్ స‌ర్వేలో యూప‌పీలో కాంగ్రెస్‌కు పాజిటివీటి లేద‌ని.. ఫుల్లుగా యాంటీ ఉంద‌ని తెలుసుకున్నాడు. వెంట‌నే ఈ బాధ్య‌త‌లు తీసుకునేది లేద‌ని.. తేల్చి చెప్పాడు. పైగా.. కాంగ్రెస్‌పైనే విమ‌ర్శ‌లు చేశాడు.

ఇక‌, ఈ మ‌ధ్య తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ కు కూడా ప‌ని చేస్తున్నార‌నే వాద‌న వినిపించింది. జాతీయ‌స్థాయిలో కేసీఆర్‌ను నిలబెట్టేందుకు పీకే ప‌నిచేస్తున్నార‌నే చ‌ర్చ సాగింది. అయితే. దీనిపై పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

అయినా.. కూడా పీకే టీం తెలంగాణ‌లో ప‌నిచేస్తోంద‌ని.. ముఖ్యంగా కేసీఆర్ త‌ర‌ఫున ఆయ‌న ప‌నిచేస్తున్నార‌నే చ‌ర్చ మాత్రం జ‌రుగుతూనే ఉంది. అంతేకాదు.. పీకే సూచ‌న‌ల‌తోనే కేసీఆర్ ప్ర‌ధాన‌మంత్రి మోడీని టార్గెట్ చేశార‌ని.. అంటున్నారు.

ఇలా .. మోడీని టార్గెట్ చేయ‌డం ద్వారా. జాతీయ‌రాజ‌కీయాల‌పై.. ప‌ట్టు పెంచుకునేందుకు కేసీఆర్ ప్ర‌య త్నిస్తున్నార‌ని కూడా చ‌ర్చలు జోరుగానే సాగుతున్నాయి.

అయితే.. పీకే నిజంగానే కేసీఆర్‌కు కొన్ని స‌ల‌హాలు ఇచ్చార‌ని అంటుఉన్నారు. దానికి కేసీఆర్.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డ‌మే కాకుండా.. పీకేకే ఎదురు క్లాస్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఇది అత్యంత హాట్ టాపిక్‌గా తెలంగాణ‌ రాజ‌కీయాల్లో సాగుతోంది.

ఎందుకంటే.. తెలంగాణ ఉద్య‌మం చేసిన‌ప్పుడు.. కేసీఆర్ ఎవ‌రి స‌ల‌హాలూ పాటించ‌లేదు. ఎవ‌రినీ ఆయ‌న సంప్ర‌దించ‌లేదు. అంతా తనే భుజంపైవేసుకుని.. ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న ప‌రిణామాల‌ను దృష్టిలో పెట్టుకుని.. ఉద్య‌మాన్ని గ‌ల్లీ నుంచిఢిల్లీ వ‌ర‌కు తీసుకువెళ్లారు.

అంద‌రినీ ఒప్పించి.. తెలంగాణ‌ను సాధించారు. 2014, 2018లో వ‌రుస‌గా అధికారంలోకి వ‌చ్చారు. ఇలాంటి త‌న‌కు స‌ల‌హాలు ఎందుకు.. ఇక‌, చెప్ప‌కు అని.. కేసీఆర్‌.. పీకేకు.. క్లాస్ పీకార‌ని.. పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో కామెంట్లు వ‌స్తున్నాయి.

ఏదో మంత్రి కేటీఆర్ కార‌ణంగా.. పీకే టీంను టీఆర్ ఎస్ నియ‌మించుకుంద‌ని, ఈ క్ర‌మంలోకే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. పీకేను ఒప్పుకొన్నార‌ని.. అంటున్నారు.

కేటీఆర్ నియ‌మించుకున్నారు కాబ‌ట్టి.. ఏవో కొన్ని ఆయ‌న ఉచిత స‌ల‌హాలు ఇవ్వు అని అన్నాడ‌ని.. అంటున్నారు. మొత్తానికి జాతీయ‌స్థాయిలో త‌న స‌ల‌హాల‌తోనే ప్ర‌బుత్వాలు ఏర్ప‌డుతున్నాయ‌ని.. చెప్పుకొనే.. పీకేకి తెలంగాణ‌లో శృంగ‌భంగం అయింద‌ని.. అంటున్నారు. 
Tags:    

Similar News