``రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిసి పని చేస్తున్నాను. ఏడు సంవత్సరాలుగా మా ఇద్దరి మధ్య దోస్తీ ఉంది. దేశ రాజకీయాల్లో మార్పుల కోసం మేం కలిసి పనిచేస్తే తప్పేముంది?`` తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్యే ఇచ్చిన కీలక క్లారిటీ ఇది. దేశ రాజకీయాల్లో మార్పు తెస్తానని, బంగారు భారత్ నిర్మిస్తానని చెబుతున్న కేసీఆర్ ఈ మేరకు పీకేతో తన సంబంధాల విషయంలో ఎలాంటి అస్పష్టత లేకుండా క్లారిటీ ఇచ్చేశారు.
మరోవైపు, పీకే కూడా కొన్నాళ్లు రాష్ట్రంలో మకాం వేసి.. కేసీఆర్ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను సేకరించారు. కొన్ని నివేదికలు అందజేశారు. ఇలా అంతా బాగున్న సమయంలో ఓ గుసగుస సోషల్ మీడియాలో తెరమీదకు వచ్చింది. అదే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పీకే గుడ్ బై చెప్పనున్నారని... పీకే తన మకాంను ఢిల్లీకి మారుస్తున్నారని అక్కడి నుంచి గుజరాత్ కు షిఫ్ట్ అయ్యేందుకు చూస్తున్నారన్నది ఈ చర్చ సారాంశం.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రంపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. కాషాయ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తానని వెల్లడించారు. దీనికి కారణం ప్రశాంత్ కిషోర్ అందించిన వ్యూహాలు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయం స్వయంగా కేసీఆరే ప్రకటించారు.
అయితే, ఏడు ఎనిమిదేళ్లుగా కేసీఆర్ తో స్నేహం చేస్తున్న పీకే ఆయనతో త్వరలో తెగదెంపులు చేసుకుంటారని అంటున్నారు. దీనికి కారణం గుజరాత్, కాంగ్రెస్ పార్టీ. గుజరాత్ లో కాంగ్రెస్ కు పని చేసేందుకు పీకే ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని... ఈ కారణం వల్ల కేసీఆర్ కు షాక్ ఇస్తారని అంటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలాకా అయిన గుజరాత్‌లో తన సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున పని చేయాలని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రాహుల్ తో పీకే భేటీ అయ్యారని, ఆ తర్వాత రాజకీయ పరిణామాలు బాగా మారిపోయాయని చెప్తున్నారు. ఈ చర్చల ఫలితంగా రేపో మాపో పీకే కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం ఉంది.
ఈ సమయంలోనే కొత్త చర్చ తెరమీదకు వస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు పని చేస్తూ.. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఎలా చేస్తారన్న అంశంపై భిన్న వాదనలు వినిపించడంతో ఆయన హస్తం పార్టీకే జై కొట్టారని విశ్లేషకులు చెబుతున్నారు . కాగా, ఈ మధ్య కాలంలో పీకే మీదే కేసీఆర్ ఎక్కువగా ఆధారపడ్డారు. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమైతే... పీకే దూరమైతే కేసీఆర్‌కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవని చెబుతున్నారు.