ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం పనులు జోరందుకున్నాయి. శంకుస్థాపన ముహుర్తానికి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ పనుల హడావుడి పెరుగుతోంది. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు గ్రామాలకు వెళ్లి ఆహ్వానపత్రాలు ఇచ్చే ప్ర్రక్రియ షురూ అయ్యింది
మంత్రులు నారాయణ.. పత్తిపాటి పుల్లారావులు.. విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులతో కూడిన బృందం తుళ్లూరు మండలం నేలపాడు గ్రామానికి వెళ్లి.. రైతులకు ఆహ్వానపత్రాలు అందించారు. రైతులకు పంచె.. చీరలతో కూడిన సంచిలను ఇవ్వటం.. స్వీట్ లను ఇచ్చి శుభలేఖలను అందించి ఆహ్వానం పలుకుతున్నారు. శుభలేఖల పంపిణీ కార్యక్రమం గ్రామాల్లో సందడి వాతావరణాన్ని నెలకొల్పుతోంది.
ఏపీ విఫక్ష నేత చెప్పినట్లుగా.. ఏపీ సర్కారు కానీ రైతుల నుంచి బలవంతంగా భూముల లాక్కొని ఉంటే.. చీర.. పంచె చేతికి ఇచ్చిన మిఠాయి పెట్టి మరీ ఆహ్వానించే ఆహ్లాదకర పరిస్థితి ఉంటుందా? అని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. తమ్ముళ్ల మాటల్లోనూ పాయింట్ ఉన్నట్లుందే..?