వ్యవసాయ బడ్జెట్ లో పత్తిపాటి ఏం చెప్పారు

Update: 2016-03-10 15:34 GMT
సుదీర్ఘంగా సాగిన ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి బడ్జెట్ ప్రసంగం తర్వాత.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు తన వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఏపీ వార్షిక బడ్జెట్ లో కేవలం 12 శాతం (సుమారు) విలువ చేసే వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వాస్తవానికి తాజా బడ్జెట్ ను చూస్తే.. వ్యవసాయం.. దాని అనుబంధ అంశాలకు పెద్ద కేటాయింపులు జరపలేదనే చెప్పాలి.

వివిధ వర్గాల సంక్షేమంపై ఎక్కువగా దృష్టి పెట్టిన ఏపీ సర్కారు వ్యవసాయానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పక తప్పదు. విభజన ప్రభావం బడ్జెట్ కేటాయింపుల మీద పడిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మౌలిక సదుపాయాల మీద.. పట్టణాభివృద్ధి మీద పెట్టిన దృష్టి వ్యవసాయం  మీదన చూపించలేదన్న విషయం వ్యవసాయ బడ్జెట్ ను చూస్తే అర్థమవుతుంది. వార్షిక బడ్జెట్ మాదిరే వ్యవసాయ బడ్జెట్ లోనూ ప్రణాళిక వ్యయం కంటే.. ప్రణాళికేతర వ్యయాన్నే ఎక్కువగా చూపించటం గమనార్హం.
 
వ్యవసాయ బడ్జెట్ లో ముఖ్యాంశాలు

=  వ్యవసాయశాఖ మొత్తం బడ్జెట్ రూ.16,250 కోట్లు

=  ప్రణాళికా వ్యయం 1,311 కోట్లు

=  ప్రణాళికేతర వ్యయం 4,474 కోట్లు

=  ఉచిత్ విద్యుత్ కు కేటాయింపులు రూ.3వేల కోట్లు

=  బిందు సేద్యానికి రూ.369 కోట్లు

=  ఉచిత్ విద్యుత్ కు రూ.3 వేల కోట్లు

=  ఆయిల్ ఫామ్ మినీ మిషన్ కోసం రూ.55 కోట్లు

=  ఉపాధిహామీకి రూ.5,094 కోట్లు

=  రెండో విడత రుణ విముక్తికి రూ. 3512 కోట్లు

=  భూసారాన్ని పెంచేందుకు రూ.80 కోట్లు

=  గుంటూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.81.40 కోట్లు

=  పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ.17.50 కోట్లు

=  వడ్డీలేని రుణాలకు రూ.177 కోట్లు

=  ఫామాయిల్ పంటల ప్రోత్సాహానికి రూ.51 కోట్లు

=  రైతు బజార్లు, ఉద్యాన యాంత్రీకరణకు రూ.102 కోట్లు

=  పట్టు పరిశ్రమకు రూ.147 కోట్లు

=  సమగ్ర కరువు నివారణకు రూ.55 కోట్లు

=  వాతావరణ ఆధారిత బీమా పథకానికి రూ.344 కోట్లు

=  పశుసంవర్ధకశాఖకు రూ.8.19 కోట్లు

=  విత్తనాభివృద్ధికి రూ.160 కోట్లు

విధానాలు

=  లక్ష హెక్టార్లలో ఉద్యానవనాల అభివృద్ధి

=  రుణమాఫీని 4 వాయిదాల్లో 10 శాతం వడ్డీతో చెల్లిస్తున్నాం

=  నదుల అనుసంధానం ద్వారా రాయలసీమకు నీళ్లు

=  4 వార్షిక వాయిదాలతో 10 శాతం వడ్డీతో చెల్లింపులు

=  వ్యవసాయ కోర్సుల్లో 25 సీట్లు అదనంగా పెంపు

=  ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తాం

=  75 వేల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం

=  350 మంది పశు వైద్య సహాయకులు.. 93 మంది పశు వైద్యుల నియామకం

=  కర్నూలు జిల్లాలో పశు సంవర్ధక కాలేజీ ఏర్పాటు

=  400 గ్రామాలను గుర్తించి పాల ఉత్పత్తి పెంచడం

=  ఒక్కొక్క పశువుకు రూ. 10 వేల సబ్సిడీ

=  కోళ్ల అభివృద్ధికి మన కోడి పథకం ప్రవేశపెట్టడం

=  20.30 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యం

Tags:    

Similar News