వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో ఉండే వీహెచ్ పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. తాజాగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. తన గొంతు మీద కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనే మాటను తాను అననంటూ వ్యాఖ్యలు చేయటం సంచలనం సృష్టించటమే కాదు.. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చిన సంగతి తెలిసిందే.
దీనిపై అసద్ తీరుపై పలువురు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రవీణ్ తొగాడియా కాస్తంత బ్యాలెన్స్ గా మాట్లాడటం గమనార్హం. భారతదేశంలో ఉంటూ శత్రువు కావాలని వారికుంటే తానేమీ చేయలేమంటూ చెప్పిన ఆయన.. భారత్ మాతాకీ జై అంటే వారు తమ వారేనని.. భారతదేశం అంటే ఇష్టం లేని వారికి ఈ దేశంలో స్థానం లేదని తేల్చారు.
ఇక్కడ పుట్టిన వారు తమ సోదరులేనని.. భాయి భాయి అంటూనే శత్రువుగా తయారు కావాలని చూస్తుంటే తామేం చేసేది లేదని.. వారంతా ఆత్మవిమర్శ చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఫైర్ బ్రాండ్ మాదిరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ప్రవీణ్ తొగాడియా నోటి నుంచి సాదాసీదా వ్యాఖ్యలు రావటం శుభ పరిణామమేనని చెప్పక తప్పదు. ఆవేశాన్ని పెంచేలా కాకుండా.. ఆవేదనతో కూడిన వ్యాఖ్యలతోనే అసద్ లాంటి మతతత్వ శక్తుల్ని ఎదుర్కోవటం మంచిది.