వైసీపీలో ఒక విషయం ఆసక్తికర చర్చగా మారింది. ఇప్పటి వరకు కేంద్రంతో రాసుకుని పూసుకొని తిరుగుతు న్న విషయం గోప్యంగానే ఉన్నా.. తాజాగా అది కాస్తా బహిర్గతం అయిపోయింది. ఇప్పుడు ఈ విషయంపైనే నాయకుల మధ్య చర్చ సాగుతుండడం గమనార్హం. ``మోడీ అంటే ఏమో అనుకున్నాం కానీ.. ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది!`` అని కీలక నాయకుడు వ్యాఖ్యానించడం.. తాడేపల్లి వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.
ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ముందు.. ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ప్రతిష్టాత్మకంగా మారింది. వచ్చే 2024 లోక్ సభ ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు హిందూ సామాజిక వర్గాలను ఆకర్షించేందుకు ఈ బిల్లును మోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును పెట్టి ఆమోదించుకు నేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అయితే.. లోక్సభలో మోడీకి తిరుగులేదు. దీంతో ఈ విషయంపై బెంగలేదు.
కానీ, ఎటొచ్చీ.. రాజ్యసభలోనే ఇబ్బందులు ఉన్నాయి. ఈ సభలో కాంగ్రెస్ సహా విపక్షాల బలం ఎక్కువగా ఉంది. దీంతో ఇక్కడ తమకు దన్నుగా నిలిచే వారు కావాలి. ఈ క్రమంలో వారికి జగన్ తురుపు ముక్కలా కనిపించారు. దీంతో లోక్సభలో ఎలా ఉన్నా.. రాజ్యసభలో మాత్రం మాకు మద్దతు ఇచ్చితీరాలని.. జగన్పై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో వైసీపీ అధినేతకు చుక్కలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
ఇదే విషయంపై వైసీపీలోనూ చర్చసాగుతోంది. ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు ఇస్తే.. మైనారిటీ ప్రజల్లో జగన్కు ఉన్న సానుభూతి.. పూర్తిగా గల్లంతవుతుందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగు తున్న ఈ పరిణామం పెద్ద దెబ్బగా మారుతుందని అంటున్నారు. మోడీకి అన్నీ తెలిసే.. ఇలా చేస్తున్నారా? ఉద్దేశ పూర్వకంగానే వైసీపీని ఇరికిస్తున్నారా? అని సీనియర్ నాయకులు మథన పడుతున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.