అతి త్వరలో దేశ వ్యాప్తంగా ప్రైవేట్ రైళ్ల కూత మొదలుకాబోతోంది. దక్షిణ మధ్య రైల్వేలో ప్రైవేట్ రైళ్ల రాకపోకలకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా వంద మార్గాల్లో సుమారుగా 150 ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీనితో ఆలస్యంగా నడిచే రైళ్ళకి కాలం తీరబోతుంది. అంటే చిన్న చిన్నగా ప్రైవేట్ రైళ్లని విస్తరించి ..ఆ తరువాత ఆలస్యంగా నడిచే రైళ్లని పూర్తిగా తొలగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు స్పష్టం అవుతుంది.
ప్రస్తుతం ఢిల్లీ - లక్నో మధ్య తేజస్ ప్రైవేట్ రైళ్లు విజయవంతంగా రాకపోకలు సాగిస్తున్నాయి. రెండో ప్రైవేట్ రైలు అహ్మదాబాద్- ముంబై మార్గంలో జనవరి 19 నుంచి అందుబాటులోకి వచ్చింది. మెరుగైన సేవల పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు రైళ్లలో ఎక్కేలా ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఏదైనా కారణంతో రైలు గమ్యస్థానానికి ఆలస్యంగా చేరుకుంటే సమయాన్ని బట్టి ఒక్కో ప్రయాణికుడికి రూ.100 నుంచి రూ.250 వరకు పరిహారం ఇస్తారు. ఈ విషయాన్ని సాక్షాత్తు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
ఇక ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్న పలు రైలు మార్గాల్లో ప్రైవేట్ రైళ్లకు అవకాశం కల్పించింది రైల్వే శాఖ. ఇందులో భాగంగా తోలి ప్రైవేట్ రైలు .. హైదరాబాద్ పరిధిలోని లింగంపల్లి నుంచి తిరుపతి మధ్య నడవనుంది. మొత్తంగా సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఏపీకి సంబంధించి ఐదు రూట్లు ఉన్నాయి. ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలోనే ఈ ప్రైవేట్ ట్రైన్స్ తిరిగేలా రూట్ మ్యాప్ ని ఎంపిక చేసారు. చర్లపల్లి - శ్రీకాకుళం, లింగంపల్లి - తిరుపతి, గుంటూరు - లింగంపల్లిల మధ్య డైలీ ట్రైన్లు నడపనున్నారు. ఇక విజయవాడ - విశాఖతో పాటూ, విశాఖ - తిరుపతి మధ్య ట్రై వీక్లీ ప్రైవేట్ రైళ్లు నడిపేందుకు మార్గం సుగమమయింది. ఇకపోతే , ఈ ప్రైవేట్ ట్రైన్స్ లో విమానాల తరహాలో సకల సదుపాయాలు , రైల్ హోస్టెస్ లు కూడా ఉంటారు. రైల్వేల్లో పెట్టుబడి కోసం హ్యూండాయ్, సీమెన్స్, ఆల్స్ట్రామ్ వంటి డజనుకు పైగా విదేశీ కార్పొరేట్లు ఈ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఉవ్విళూరుతున్నట్టు తెలుస్తుంది. అయితే , ఈ పైవేట్ రైళ్ల వల్ల, ఇప్పటికే ఆలస్యంగా నడుస్తున్న రెగ్యులర్ రైళ్లు మరింత జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.