అంచనాలకు భిన్నంగా.. కాస్త ఆలస్యంగా మూడో వేవ్ వచ్చేసింది. ఇప్పటికే అమెరికా.. యూరప్ లోని పలు దేశాల్ని చుట్టేస్తున్న కరోనా.. ఇప్పుడిప్పుడే మన దేశంపై ప్రభావాన్ని చూపుతోంది. ఇలాంటివేళ.. ఎక్కువ మంది కరోనా బారిన పడకుండా ఉండేందుకు వీలుగా బూస్టర్ డోసులు వేయాలని కేంద్రం నిర్ణయించటం తెలిసిందే. ఇంతకీ బూస్టర్ డోస్ ఎంతలా పని చేస్తుంది. తాజాగా భయపెడుతన్న ఒమిక్రాన్ వేరియంట్ ను బూస్టర్ డోసు ఎంతలా నిలువరిస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దీనికి సంబంధించి యూకే హెల్త్ సెక్యురిటీ ఏజెన్సీ అధ్యయనాన్ని నిర్వహించింది. దీని ప్రకారం వ్యాక్సిన్ మొదటి రెండు డోసుల కంటే కూడా మూడో డోస్ కారణంగా అత్యధిక రక్షణ కలుగుతుందని పేర్కొంది. కొవిడ్ టీకాల రెండు డోసులు తీసుకున్న ఆర్నెల్ల తర్వాత వాటి రక్షణ 52 శాతానికి పడిపోతుందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో బూస్టర్ డోస్ వేసుకుంటే.. రోగ నిరోధక శక్తి పెరగటమేకాదు.. కరోనా ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు.
బూస్టర్ డోస్ తో టీకా రక్షణ సామర్థ్యం 52 శాతం నుంచి 88శాతానికి పెరుగుతున్నట్లుగా ఈ అధ్యయనం పేర్కొంది. తాజాగా దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ నను సైతం మూడో డోసు టీకా తీసుకుంటే.. సమర్థంగా నిలువరిస్తోందని చెబుతన్నారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తో ఆసుపత్రి పాలు కావట మూడు రెట్లు తక్కువగా ఉందని ఈ అధ్యయనం గుర్తు చేసింది. ఈ అధ్యయనానికి తగ్గట్లే తాజాగా యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ మాటలు ఉండటం గమనార్హం.
తమ దేశంలో ఒమిక్రాన్ కారణంగా ఐసీయూలో చేరికలు తక్కువగా ఉన్నాయని.. గత వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ముందు జాగ్రత్తలో భాగంగా బూస్టర్ డోసు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో భావించినట్లుగా తీవ్రమైన లాక్ డౌన్ అవసరం లేకపోవచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే.. గత వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్ వేగంగావిస్తరిస్తోందని.. దీని కారణంగా దేశంలోకేసులు వేగంగా పెరుగుతున్నట్లుగా చెప్పారు. సో.. బూస్టర్ డోసుతో ఒమిక్రాన్ కట్టడి సాధ్యమన్నఈ అధ్యయనంలో పస ఎంతన్నది రానున్న రోజులు తేల్చనున్నాయి.