సిగ్గు, శరం ఉన్నాడెవడూ వైసీపీలోకి వెళ్లడు: కమెడియన్ ఫృథ్వీ సంచలన వ్యాఖ్యలు

Update: 2022-06-21 13:30 GMT
30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సినిమాల్లో కామెడీ పండించిన అనంతరం రాజకీయాల్లోకి వెళ్లి వైసీపీ అధికారంలోకి రావడంతో టీటీడీ భక్తి చానెల్ లో కీలక పదవి పొందిన కమెడియన్ ఫృథ్వీ అంతే వేగంగా కొన్ని ఆరోపణలతో ఆ పదవిని పోగొట్టుకున్నారు.

ఫృథ్వీకి ప్రతిష్టాత్మక శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్ చైర్మన్ ను చేసిన జగన్ .. ఆ తర్వాత అతడిపై లైంగిక ఆరోపణలు రావడంతో తొలగించారు. ప్రస్తుతం కమెడియన్ గా సినిమాల్లో రాణిస్తున్నాడు.

ఎన్నడో వైసీపీలో చేరి ఆ పార్టీ తరుఫున విస్తృతంగా ప్రచారం చేశాడు కమెడియన్ ఫృథ్వీ. 2014 ఎన్నికల్లో కూడా చురుకుగా ప్రచారం చేశాడు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పదవి పొందాడు.

ఇప్పుడు పదవి కోల్పోయాక తొలిసారి వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన, పవన్ పై గతంలో విమర్శలు చేసిన ఫృథ్వీ ఇప్పుడు తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వైసీపీపైనే విరుచుకుపడడం విశేషం.

వైఎస్ జగన్ మళ్లీ పిలిస్తే వెళతారా? అని ఓ మీడియా ప్రశ్నించగా ఫృథ్వీ బరెస్ట్ అయ్యారు. ‘చాలండి నమస్కారమండీ.. ’ అంటానని బదులిచ్చాడు. వెళ్లే వాళ్లకైనా సిగ్గు, శరం ఉండాలి. నేనెప్పుడూ కులం గురించి మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెబుతున్నా.. గోదావరి జిల్లా చోళ్లంగిలో పుట్టిన కాపు బిడ్డగా చెబుతున్నా.. అలాంటి పనులు మా జాతిలో ఎవడూ చేయడు’ అని ఫృథ్వీ నిప్పులు చెరిగారు. మళ్లీ వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదన్నట్టుగా ఫృథ్వీ చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 40 సీట్లు కొట్టబోతున్నాడని.. నేను రాసిస్తానని ఫృథ్వీ చెప్పుకొచ్చాడు. ఘంఠాపథంగా చెబుతున్నానని.. జనసేన జెండా ఎగురుతుందని.. 2024 ఎన్నికల్లో ఆయనే కింగ్.. అంటూ ఫృథ్వీ మాట్లాడారు. చూస్తుంటే ఫృథ్వీ అడుగులు తన సొంత సామాజికవర్గం వారు ఉన్న జనసేన వైపు, పవన్ కళ్యాణ్ వైపు పడుతున్నట్టు అర్థమవుతోంది.
Tags:    

Similar News