నటి పూజిత - ఐఏఎస్ అధికారిణి రేఖారాణిల భర్త వివాదం మరింత ముదిరింది. తనకు ప్రాణహాని ఉందని... తనను కాపాడాలని కోరుతూ పూజిత మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త విజయగోపాల్ విడాకులు తీసుకోకుండా ఐఏఎస్ అధికారిణి రేఖారాణి ని పెళ్లిచేసుకున్నాడంటూ పూజిత వారం కిందట పోలీసులకు కంప్లయింట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త విజయ్ గోపాల్ - రేఖారాణి తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని.. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. తనకు, తన కుమారుడికి రక్షణ కల్పించాలని కోరింది.
మరోవైపు ఎప్పటిలాగే విజయ్ గోపాల్ పాత మాటే చెబుతున్నారు. తాను పూజితను అసలు పెళ్లే చేసుకోలేదని అంటున్నారు. ఆమెతో కేవలం సహజీవంన చేశానని... సుమారు 12ఏళ్ల పాటు తమ సహజీవనం సాగిందని... ఏడేళ్లుగా ఇద్దరం దూరంగా ఉంటున్నానని చెబుతున్నారు. పూజిత కుమారుడు తనకు పుట్టినవాడేనని విజయ్ గోపాల్ అంగీకరించారు మరోవైపు ఐఏఎస్ రేఖారాణి కూడా తన భర్త విజయ్ గోపాల్ చెప్పిందంతా నిజమేనంటోంది. పూజితతో ఆయనకు సంబంధం ఉందని.. వారిద్దరికీ కొడుకు ఉన్నాడని.. కానీ, ఇద్దరూ పెళ్లి చేసుకోలేదని, తాను చట్టప్రకారం అన్నీ చూసుకున్న తర్వాతనే విజయ్ గోపాల్ ని పెళ్లి చేసుకున్నానని చెబుతున్నారు.
కాగా ఐఏఎస్ రేఖారాణి దివంగత ఐపీఎస్ అధికారి పరదేశి నాయుడు భార్య. పరదేశి నాయుడు 1987లో నక్సలైట్ల దాడిలో మరణించారు. ఆ తరువాత రేఖారాణి అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్ అధికారిణి అయ్యారు. సమర్థురాలైన అధికారిణిగానూ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు విజయ్ గోపాల్ ను పెళ్లి చేసుకున్న తరువాత వివాదంలో చిక్కుకున్నారు. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.