పటేల్ విగ్రహం పై బాబు - పురంధేశ్వరి పంచాయతీ

Update: 2018-11-01 16:38 GMT
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా సర్దార్ పటేల్ స్టేట్యూ ఆఫ్ యూనిటీని నిన్న ప్రధాని మోదీ గుజరాత్‌లో ఆవిష్కరించారు. ఆయన అలా ఆవిష్కరించారో లేదో ఇలా ఒక ఫేక్ ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. పటేల్ విగ్రహం వద్ద శిలాఫలకంలో దక్షిణాది నుంచి కేవలం తమిళభాషకే స్థానమిచ్చారని... తెలుగుకు స్థానమివ్వలేదంటూ ఇమేజ్ ఒకటి సర్క్యులేట్ అయింది. టీడీపీ సోషల్ సైన్యాలు దీని వైరల్ చేసేశాయి. చివరికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా దీనిపై మాట్లాడి విమర్శలు చేశారు.
    
భారత్ లో అత్యధిక ప్రజలు మాట్లాడే మూడో భాషగా తెలుగు ఉందనీ, అలాంటి భాషకు ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ శిలాఫలకంపై చోటు కల్పించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే మూడో అతి పెద్ద భాషయిన తెలుగుకు  #StatueOfUnity శిలాఫలకంపై గుర్తింపు లభించకపోవడంతో తెలుగు తల్లి బిడ్డగా నా మనసు క్షోభిస్తోంది.పైసా ఖర్చు లేని ఇటువంటి విషయాలలో కూడా తెలుగు వారంటే ఇంత వివక్షా? ప్రతి తెలుగు వారూ అలోచించి, తమ ఆవేదనను వ్యక్తం చేయవలసిన తరుణమిది’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
    
అయితే... ఈ ఫేక్ ఇమేజ్ సంగతి తెలుసుకోకుండా చంద్రబాబు ట్వీట్ చేయగా దానికి బీజేపీ నేత పురంధేశ్వరి కౌంటరేశారు. వాస్తవాలు వెల్లడించారు. ఆ శిలాఫలకంపై తెలుగు భాషకు స్థానం కల్పించలేదన్న వార్తలను ఖండిస్తూ ఓ పోస్ట్ చేశారు. ఆ శిలాఫలకంపై ‘తెలుగు’ - ‘కన్నడ’ తదితర భాషలు ఉన్నాయని తెలియజేస్తూ శిలాఫలకం అసలైన ఫొటోను పోస్ట్ చేశారు. ‘ఐక్య భారతం శ్రేష్ఠ భారతం’ అని తెలుగులో రాసి ఉంది అందులో. ఈ సందర్భంగా టీడీపీపై ఆమె నిప్పులు చెరిగారు. ‘ఆఖరికి ఆ మహానుభావుడిని కూడా మీ పచ్చ బానిసత్వానికి బలిచేశారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Tags:    

Similar News