ప్రపంచం ఒక కుగ్రామం అయిన వేళ ఏ ఇద్దరు మధ్య యుద్ధం వచ్చినా మొత్తం విశ్వం మీద ప్రభావం పడుతుంది. అదే సమయంలో ఈ ఇద్దరికీ చెరో వైపునా లాగేసే వారూ ఉంటారు. ఎటూ కాకుండా తటస్థంగా ఉంటూ మన వ్యక్తిత్వాన్ని నిలుపుకుందామనుకుంటే కుదిరే రోజులు కావు. అయినా భారత్ కి అందరూ కావాలి అన్నదే నినాదం. శాంతి మన మంత్రం.
అయితే అర్ధం చేసుకునే వారు ఉన్నారా అన్నదే ఇక్కడ చర్చ. ఇక రష్యా ఉక్రెయిన్ మీద పడి యుద్ధం చేయడాన్ని అంతా తప్పుపడుతున్నారు. భారత్ కూడా యుద్ధం వద్దు అనే చెబుతోంది. రెండు దేశాలూ కూర్చుని మాట్లాడుకోవాలని కూడా కోరుతోంది. అయితే ఈ విషయంలో పుతిన్ తో ఫోన్ లో ప్రధాని మోడీ మాట్లాడారు, అలాగే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో కూడా చర్చించారు.
అయినా ఈ యుద్ధం ఆగడంలేదు. నాటో దేశాలతో పాటు అమెరికా పెద్దన్న తెర వెనక ఉన్నారని రష్యా అనుమానం. దాన్ని నిజం చేసేలా ఉక్రెయిన్ రష్యాల మధ్య చర్చలు దోబూచులాట ఆడుతున్నాయి. యుద్ధం మాత్రమే నికరంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో భారత్ అయితే తనది న్యూట్రల్ రోల్ అని చెప్పేసింది. ఐక్య రాజ్యసమితిలో కూడా ఎటూ ఓటేయకుండా తటస్థ వైఖరి అవలంబించింది. దాంతో అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కి కోపం వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది.
ఇదిలా ఉండగా ఇపుడు రష్యా భారత్ కి ఉన్న ఉదుటన ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ యుద్ధం వల్ల ప్రపంచంలో చమురు ధరలు విపరీతంగా పెరుగుతాయన్న ఆందోళన ఉంది. అలాగే భారత్ లో ఆ భయాలు ఉన్నాయి. అయితే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మాత్రం భారత్ పట్ల ప్రేమ చూపిస్తూ కారు చౌకగా చమురుని ఇస్తామని ఆఫర్ ఇచ్చేశారని ప్రచారం సాగుతోంది.
రష్యా డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ అయితే దీని మీద కేంద్రంలో డైరెక్ట్ గా మాట్లాడారని తెలుస్తోంది. ఒక విధంగా ఇది భారత్ పరంగా చూస్తే సూపర్ ఆఫర్. భారత్ ఆర్ధిక వ్యవస్థ మొత్తానికి ఊపిరి ఇచ్చే పరిణామం. అయితే ఇక్కడే లోతుగా కేంద్రం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అంటున్నారు. ఎందుకంటే అమెరికా సహా యూరోపియన్ దేశాలు భారత్ పట్ల ఎలా వ్యవహరిస్తాయి అన్న మీమాంస అయితే ఉంది.
ఇక రష్యా ఆఫర్ చూస్తే క్రూడయిల్ నిల్వలు పెద్ద ఎత్తున అక్కడ పేరుకుపోతున్నాయి. మిగిలిన ప్రపంచంలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 139 డాలర్లకు చేరగా రష్యా మాత్రం భారత్ కే మా ఆఫర్ అని ఊరిస్తోంది. అయితే ఇది అంతర్జాతీయ పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అంశమని అంటున్నారు. ఏకపక్షంగా రష్యా ఆఫర్ కి తలొగ్గితే మిగిలిన ప్రపంచానికి భారత్ దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా రష్యా బంపర్ ఆఫర్ మాత్రం ఊరించే విధంగానే ఉంది.