చరిత్రలో నిలిచిపోనున్న ఈ ఫ్లైట్ సాధించిన ఘనకార్యం ఎంతంటే?

Update: 2019-10-21 06:47 GMT
ఒక ప్యాసింజర్ విమానం నాన్ స్టాప్ గా 19 గంటల పాటు ప్రయాణం చేసి.. గమ్యస్థానం చేరుకోవటం సాధ్యమేనా? అంటే నో అని చెప్పేస్తారు. ఇకపై అలా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆ అరుదైన ఫీట్ ను సాధించిందో ప్యాసింజర్ విమానం. ప్రపంచ పౌర విమానయాన చరిత్రలో నిలిచిపోయేలా చోటు చేసుకున్న ఈ ఉదంతం ఎంత అపూర్వమంటే..

న్యూయార్క్ నుంచి సిడ్నీకి నాన్ స్టాప్ గా వెళ్లేందుకు ఖంటాస్ క్యూఎఫ్ 7879విమానాన్ని సిద్ధం చేశారు. ఫ్యూయల్ కోసం కానీ.. మరే కారణం కోసం కానీ మధ్యలో ఎక్కడా ఆగకుండా ఏకంగా 19 గంటల 16 నిమిషాల పాటు ప్రయాణించి సిడ్నీలో ల్యాండ్ అయ్యింది. 49 మందితో ప్రయాణించిన ఈ విమానం ఏకంగా 16వేల కిలోమీటర్లు ప్రయాణించింది.  

బోయింగ్ 787-9 విమానం ఇంధనాన్ని తిరిగి నింపుకునే అవసరం లేని రీతిలో ఏర్పాట్లు చేశారు. దీంతో..16వేల కిలోమీటర్ల దూరాన్ని.. భిన్న టైమ్ జోన్స్ ను దాటి ప్రయాణికుల్ని విజయవంతంగా చేర్చిన వైనం ఒక అపురూప రికార్డుగా నిలిచిపోతుందని చెబుతున్నారు. తాజా ప్రయాణం తర్వాత అమెరికా.. బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియాకు ఈ విమానం ద్వారా మారథాన్ విమాన సేవల్ని అందించేందుకు ఖంటాస్ సిద్ధమవుతోంది.
Tags:    

Similar News