స్వామీజీలను.. బాబాల పట్ల అమితమైన భక్తిని ప్రదర్శించి.. వారికి వెన్నుదన్నుగా నిలవటం రాజకీయ నాయకులకు కొత్తేం కాదు. దేశంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు చేసే ఈ చేష్టల కారణంగా విమర్శలు మూటగట్టుకుంటుంటారు. తాజాగా ఆ జాబితాలో చేరారు కేంద్రమంత్రి విజయ్ సంప్లా.
గతకొద్దిరోజులుగా తన వైఖరితో వివాదాస్పద అధ్యాత్మికవేత్త రాధేమా విషయంలో కేంద్రమంత్రి తొందరపడినట్లుగా కనిపిస్తోంది. ఆమెపై గృహహింస కేసులు మొదలు.. పలువురి ఆస్తుల్ని బలవంతంగా తీసేసుకున్నారన్న ఆరోపణలతో పాటు.. తన వివాదాస్పద వైఖరితో వార్తల్లోకి నిలిచిన రాధేమాకు తన మద్ధతును బహిరంగంగా ప్రకటించటానికి కేంద్రమంత్రి విజయ్ సంప్లా పెద్దగా వెనుకాడలేదు.
భక్తులతోకలిసి బాలీవుడ్ గీతాలకు డ్యాన్సులు వేయటం.. పోర్న్ స్టార్ సన్నీ లియాన్ ను తాను ఆరాధిస్తానని చెప్పటమే కాదు.. పొట్టి పొట్టి డ్రెస్సులతో.. ఇష్టారాజ్యంగా ఫోటోలు దిగే అధ్యాత్మికవేత్తగా చెప్పుకునే రాధేమా తీరుపై పలువురు విమర్శలు చేస్తుంటారు.
అయితే.. ఆమెను ఆకాశానికి ఎత్తేస్తూ కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేశారు. తాను రాధేమాను గౌరవిస్తారని.. ఆమెకున్న దివ్యశక్తులతో తాను ఆమె భక్తుడిగా మారిపోయానని చెప్పుకొచ్చారు. తన ఇంట్లో ఆమె భజన కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పుకున్న ఆయన.. రాధేమా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గంలో ఓటరు కావటం తన అదృష్టంగా చెప్పుకుంటున్నారు. వివాదాస్పద వ్యక్తుల విషయంలో హద్దులు మీరి తమకున్న భక్తిశ్రద్ధల గురించి చెప్పుకోవటానికి మించిన దురదృష్టం ఇంకేం ఉంటుంది..?