కమల్ సీఎం అవుతారట.. ఆ మాట చెప్పిందెవరో తెలుసా?

Update: 2021-03-18 07:30 GMT
ఎన్నికల వేళ చెప్పే మాటలు అతికేలా లేకున్నా ఫర్లేదు.. కామెడీ చేసేలా అస్సలు ఉండకూడదు. తాజాగా ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇదే రీతిలో ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటివరకు ఏ సర్వేలోనూ.. అధ్యయనాల్లోనూ.. విశ్లేషణలోనూ నటుడు కమల్ ఏర్పాటు చేసిన మక్కల్ నీది మయ్యం అధికారంలోకి వస్తుందన్న మాటే రాలేదు. అందుకు భిన్నంగా ఆమె మాత్రం.. తమిళనాడు ఎన్నికల్లో కమల్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని చెబుతున్నారు.

తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. సుపరిపాలన లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన తమ కూటమికి విజయం ఖాయమన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు. విద్య.. వైద్య రంగంలో ప్రముఖులైన ఇండియా జన నాయక కట్చి అధ్యక్షులు రవి.. మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్.. సమత్తువ మక్కల్ కట్చి అధినేత శరత్ కుమార్ లు కలిసి ఒక కూటమిగా ఏర్పడిన విషయాన్ని చెప్పిన రాధిక.. ఈసారి మార్పును తమిళ ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

భావి తరాలకు కమల్ మంచి చేస్తారన్న నమ్మకం ఉందని.. సుపరిపాలనకు నిదర్శనంగా కూటమి మేనిఫేస్టో ఉందన్న ఆమె.. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి కమల్ అని పేర్కొన్నారు. అంతా బాగానే ఉంది కానీ.. అసలు కమల్ బరిలో దిగిన నియోజకవర్గంలోనైనా గెలుస్తారా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.
Tags:    

Similar News