టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నిన్న సీఎం జగన్ ను పట్టుకోని ‘ఒరేయ్.. బోసిడీకే’ అంటూ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు ఏకంగా టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై పడి ధ్వంసం చేశారు. ఇదిప్పుడు ఏపీ రాజకీయాలను కుదుపు కుదిపేస్తోంది. దీనిపై అధికార, విపక్షాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం అసలు బోషిడికే అనేది బూతు పదం కాదని.. దానికి అసలైన అర్ధం ఇదంటూ జగన్ సర్కార్ పై సీరియస్ సెటైర్లు వేశారు.
బుధవారం ఢిల్లీలో రఘురామ మీడియాతో మాట్లాడారు. ఈ వివాదానికి అసలు కారణమైన ‘బోసిడీకే’ పదానికి ఎంపీ రఘురామ అర్థం చెప్పారు. ‘టీడీపీ నేత పట్టాభి సీఎం జగన్ ను బోసిడీకే అనబట్టే వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయని తెలిసింది. అయితే ఇంత వివాదానికి కారణమైన ఆ పదానికి అర్థమేంటో తెలుసుకునేందుకు నేను ప్రయత్నించాను. చివరకు నేను తెలుసుకున్నది ఏంటంటే బోసిడీకే అనేది బూతు పదం కాదు’ అని ఎంపీ రఘురామ క్లారిటీ ఇచ్చారు.
బోసిడీకేను గూగుల్ లో సెర్చ్ చేయగా ఆ పదానికి చాలా స్ఫష్టమైన అర్థం దొరికిందని రఘురామ తెలిపారు. ‘సర్ మీరు బాగున్నారా?’ అని సంస్కృతంలో బోసిడీకే దానికి అర్థం అని రఘురామ సెలవిచ్చారు. నిజానికి బూతులు మాట్లాడడమే తప్పయితే.. ఎదుటి వాళ్లపై దాడి చేయడానికి దాన్నే కారణంగా చూపాలనుకుంటే వైసీపీ మంత్రుల పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చన్నారు.