మాజీ టీఆరెస్ నేత, ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అధికార ప్రతినిధిగా ఉన్న రఘునందనరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు తెరతీశాయి. కొద్దిరోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోతారని... ఆయన కుమారుడు కేటీఆర్ కు ఆ పదవి అప్పగిస్తారని రఘునందనరావు అన్నారు. తెలంగాణలో రాజకీయంగా జరుగుతున్న పరిణామాలన్నీ ఆ మార్పు దిశగానే కనిపిస్తున్నాయని ఆయన విశ్లేషించారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయడానికి రంగం సిద్ధమవుతోందని రఘునందనరావు అంటున్నారు.
కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశంతో కేసీఆర్ పార్టీని బలోపేతం చేస్తున్నారని... ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను తీసుకొస్తున్నారని చెబుతున్నారు. పార్టీలో ఇద్దరు యువనేతల మధ్య ఉన్న అంతర్గత పోటీలో కేటీఆర్ నిలదొక్కుకుని సజావుగా సీఎం కావడానికివీలుగా ఆపరేషన్ ఆకర్ష చేపట్టారని ఆయన అంటున్నారు.
కాగా కేటీఆర్ సమీప భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని బలంగా నమ్ముతున్న రఘునందనరావు పనిలోపనిగా కేటీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. కేటీఆర్ మంత్రిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారని... ఇంగ్లీష్ లో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉండడం కలిసొచ్చే అంశమని రఘునందనరావు ప్రశంసలు కురిపించారు.