మళ్ళీ రఘురామ అరెస్టు ?

Update: 2021-06-17 09:42 GMT
వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు మళ్ళీ అరెస్టు తప్పదా ? బెయిల్ నింబంధనలను ఉల్లంఘించినందుకు ఎంపిని సీఐడీ పోలీసులు మళ్ళీ అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. రాజద్రోహం ఆరోపణల పై అరెస్టయిన ఎంపి చివరకు సుప్రింకోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకున్నారు. ఎంపికి బెయిల్ ఇచ్చేటపుడు సుప్రింకోర్టు పెట్టిన కండీషన్లను రఘురామ ఫాలో అవలేదట.

ఇంతకీ ఆ కండీషన్లు ఏమిటంటే వ్యక్తిగతంగా రఘురామతో పాటు మరో ఇద్దరు ష్యూరిటిల నుండి పూచీకత్తు తీసుకోవాలి. మూడు పూచీకత్తులను ఆర్మీ ఆసుపత్రిలో డిస్చార్జయిన పదిరోజుల్లో గుంటూరులోని సీఐడీ కోర్టులో సమర్పించాలని సుప్రింకోర్టు ఆదేశించింది. ఎంపి డిస్చార్జయిన తర్వాత ఆయన తరపున లాయర్లు ఇద్దరు ష్యూరిటీలను సీఐడీ కోర్టుకు అందించారు. దాంతో ఎంపిని జెయిల్ నుండి విడుదల చేస్తు సీఐడీ కోర్టు రిలీజ్ ఆర్డర్ ను లాయర్లకు అందించింది.

అయితే ఆర్మీ ఆసుపత్రి నుండి డిస్చార్జయిన ఎంపి రిలీజ్ ఆర్డర్ తీసుకునేందుకు వెయిట్ చేయకుండానే ఢిల్లీకి వెళ్ళిపోయారు. సీఐడీ కోర్టు నుండి వచ్చిన రిలీజ్ ఆర్డర్ ను ఆర్మీ ఆసుపత్రి తిరిగి సీఐడీ కోర్టుకు తిప్పిపంపేసింది. ఎందుకంటే అప్పటికే ఎంపి డిస్చార్జయి ఢిల్లీకి వెళ్ళిపోయారు కాబట్టి. నిజానికి రిలీజ్ ఆర్డర్లో సంతకాలు చేయకుండా ఢిల్లీ వెళ్ళిపోవటం ఎంపి తప్పు. దీంతో పాటు ఎంపి మరో తప్పు కూడా చేసినట్లు సమాచారం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రిలీజ్ ఆర్డర్ పై ఎంపి సంతకం చేయలేదంటే సాంకేతికంగా తాను ఇంకా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు అంగీకరిస్తున్నట్లే లెక్క. ఇదే విషయాన్ని జైలు అధికారులు సీఐడీ కోర్టుకు తెలిపారు. దాంతో ఎంపికి ఈనెల 25వరకు రిమాండ్ పొడిగిస్తు సీఐడీ కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం ఇద్దరు ష్యూరిటిలను సీఐడీ కోర్టుకు అందించిన ఎంపి వ్యక్తిగతంగా తన ష్యూరిటి ఇవ్వలేదట.

పదిరోజుల్లో మూడు ష్యూరిటిలను ఇవ్వమంటే ఇద్దరిది మాత్రమే ఇచ్చి మూడోది ఇవ్వలేదంటే సుప్రింకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లే అనుకోవాలని సీఐడీ పోలీసులు అంటున్నారు. ఈ సాంకేతిక కారణం వల్ల ఎంపిని పరారీలో ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఏ రోజైనా ఎంపిని పోలీసులు మళ్ళీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట.
Tags:    

Similar News