తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ పూర్తిగా కట్టు తప్పినట్లు కనిపిస్తోంది. కొద్దికాలం వరకు ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా వచ్చిన నేతలకు- పార్టీలో అంతకుముందు ఉన్న నేతలకు మధ్య నడిచిన ప్రచ్చన్న యుద్ధాలు సద్దుమణుగుతుండగా...ఇపుడు తమ్ముళ్ల మధ్య పంచాయతీలు తారాస్థాయికి చేరుతున్నాయి. తాజాగా ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై పీటముడి బిగుసుకుంటోంది. కుర్చీ కోసం స్థానిక నాయకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది.. అధికారంలోనే ప్రతిపక్షం తయారవడం పార్టీ శ్రేణులకు మింగుపడటంలేదు. దీంతో ప్రతిపక్ష నాయకుడు జగన్ జిల్లాలో పట్టుసాధించాలనే క్రమంలో కుంపట్లతో పరిహాసం అయ్యే పరిస్థితి వచ్చిందని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.
ప్రొద్దుటూరులో ప్రస్తుతం రాజకీయం రసవత్తరంగా మారింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రొద్దుటూరు పురపాలిక స్థానాన్ని తెదేపా కైవసం చేసుకుంది. మొత్తం 22 స్థానాలను తెదేపా చేజిక్కించుకుని సత్తా చాటగా.. 18 స్థానాలకు వైకాపా పరిమితమైంది. తెదేపా నేతలు గురివిరెడ్డి - రఘురామిరెడ్డి ఇద్దరూ ఛైర్మన్ పదవి రేసులో నిలిచారు. ఎవరికి పదవి కట్టబెట్టాలన్న దానిపై తెదేపాలో తీవ్రస్థాయిలో తర్జనభర్జన జరిగింది. పార్టీ నేతల సమాలోచనల అనంతరం ఎట్టకేలకు గురివి రెడ్డికి తొలి రెండేళ్లు - మలి విడతలో మూడేళ్లు రఘురామిరెడ్డికి పదవి దక్కేలా సయోధ్య కుదిరింది. ఆ మేరకు తొలి విడతలో గురివిరెడ్డి ఛైర్మన్ పగ్గాలు చేపట్టారు. ఆ గడువు 2016 జులై 3వ తేదీతో ముగిసింది. గురివిరెడ్డి స్వచ్ఛందంగా తప్పుకొంటే పదవిని చేపట్టే దిశగా రఘురామిరెడ్డి సమాయత్తమయ్యారు. ఇక్కడే కథ మళ్లీ మలుపు తిరిగింది! ఎన్నికల వేళ తన పరంగా పెట్టిన అదనపు ఖర్చును తిరిగి చెల్లిస్తే.. తప్పుకొనేందుకు సిద్ధమంటూ గురివిరెడ్డి పార్టీ వర్గాలకు సంకేతాలిచ్చారు. దీనిపై పార్టీ వర్గాలు మౌనం దాల్చడంతో పరిస్థితి కీలకంగా మారింది. ఇక్కడ, ‘ఆర్థిక’ అంశాలతో తనకు సంబంధం లేదని - పార్టీవర్గాల ఒడంబడిక మేరకు పదవిలోకి అవకాశమివ్వాలంటూ రఘురామిరెడ్డి పట్టుబట్టారు. ఇలా ఎవరికి వారు పంతాలకు పోవడంతో పదవి మార్పుపై అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో గత నెలలో జరిగిన కౌన్సిల్ సమావేశానికి రఘురామిరెడ్డి గైర్హాజరయ్యారు. ఈ కుర్చీ యుద్ధం నివురుగప్పిన నిప్పులా మారి ప్రొద్దుటూరులో చర్చనీయాంశమైంది. తెదేపా నాయకులకు తలనొప్పిగా తయారయింది.
ఇదిలాఉండగా తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రఘురామిరెడ్డి ప్రకటించారు.కమిషనర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని స్వయంగా అందించారు. ఒప్పందం మేరకు తనకు పదవిలోకి వెళ్లడానికి అవకాశం ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెంది నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇది తెదేపా వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇప్పటివరకు స్తబ్ధుగా ఉన్న ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇరువర్గాలు పీఠం కోసం పట్టుబట్టిన పరిస్థితుల్లో వ్యవహారం అధిష్ఠానం వద్దకు చేరింది. దీనిపై జిల్లా పార్టీకీ స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. క్రమేణా వివాదం ముదురుతున్న తరుణంలో వేడి చల్లార్చే దిశగానూ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఇక్కడ ఇద్దరు ముఖ్యనేతలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న క్రమంలో పార్టీవర్గాలు జోక్యం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. రెండ్రోజుల్లో పార్టీకి చెందిన ముఖ్య నేతలు - జిల్లా పార్టీ పెద్దలు ఇరువర్గాలతోనూ చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సమస్యను కొలిక్కి తెచ్చి పీఠం పీటముడిని విప్పే దిశగా కసరత్తు మొదలైంది. మంతనాల అనంతరం పదవి మార్పు ఉంటుందో? లేదో?.. కుర్చీ ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ ప్రొద్దుటూరు వాసుల్లో నెలకొంది. మరోవైపు ఇటీవల కడప జిల్లాలో పార్టీ బలపడుతుందనే సంకేతాలు వస్తున్న సమయంలో ఈ పరిణామం ఏమిటనే చర్చ సాగుతోంది.