2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల పర్వంపై ఊహించని ట్విస్ట్ చోటుచేసుకోనుందా? ఆ ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్-టీడీపీ జతకట్టనున్నాయా? కేంద్ర ప్రభుత్వమే టార్గెట్ గా భిన్న దృవాలైన ఈ రెండు ప్రధాన పార్టీలు పొత్తు పెట్టుకోనున్నాయా? అనే సందేహాలకు అవుననే సమాధానం వస్తోంది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి - టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు స్పందించిన తీరుతో క్లారిటీ వచ్చింది.
ఏపీపీసీసీ చీఫ్ రఘువీరా మాట్లాడుతూ 72 శాతం మంది ఆంధ్ర ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానిగా కోరుకుంటున్నారని అన్నారు. పప్పు అంటూ కొందరు విమర్శించిన రాహుల్...ఇప్పుడు నిప్పు అయ్యారని చెప్పారు. ఏపీలో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని అధిష్ఠానం చెప్పిందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీతో పొత్తు అంశాన్ని హైకమాండే చూసుకుంటుందని... అయితే, పార్టీ పెద్దల ఆదేశాలను తాము పాటిస్తామని తెలిపారు. ఎన్నికలకు రెండు నెలల ముందు చిరంజీవి ప్రచారానికి వస్తారని చెప్పారు. జగన్ పై దాడి విషయంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయని అన్నారు. దాడి ఘటనను టీడీపీ - వైసీపీ - బీజేపీలు రాజకీయాలకు వాడుకుంటున్నాయని చెప్పారు.
మరోవైపు కాంగ్రెస్ తో పొత్తుపై డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టంగా తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఓటమే తమ లక్ష్యమని - ఇందుకు ఎవరితోనైనా కలుస్తామని - అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు కూడా టీడీపీ సిద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ - కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. డొక్కా వ్యాఖ్యలను బట్టి ఏపీలోను కలిసి పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానించారు. రెండు పార్టీలకు చెందిన నేతల కామెంట్లతో తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బద్ధ శతృవులైన కాంగ్రెస్ - టీడీపీ జతకట్టిన రీతిలోనే రాబోయే ఎన్నికల్లో కూడా ఉంటుందని పలువురు ధీమా వ్యక్తం చేశారు. అయినా... కాంగ్రెస్ వాళ్లను టీడీపీలోకి ఎన్నికల ముందు ఆహ్వానించినపుడే ఏదో ఒకరోజు టీడీపీ - కాంగ్రెస్ కలిసేపార్టీలే అని ఊహించామని వైసీపీ నేతలు ఆరోపించారు.