రాహుల్ గాంధీ సత్తా ఏంటో ఇండియా మొత్తానికీ ఇప్పటికే తెలుసు.. మోడీ ముందు ఆయనెంతో కూడా అనేక సార్లు నిరూపించుకున్నారు. అయినా రాహుల్ మాత్రం ఇంకా ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నారు. లేస్తే మనిషిని కానంటున్నారు. తనను లేవనివ్వకుండా చేస్తున్నారంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... నోట్ల రద్దుపై తాను కనుక పార్లమెంటులో మాట్లాడితే బ్రహ్మాండం బద్దలవ్వాల్సిందేనని రాహుల్ చెప్పుకొంటున్నారు.
పెద్ద నోట్ల రద్దుపై తాను పార్లమెంట్‌లో చెప్పే విషయాలతో భూకంపం వస్తుందంటున్నారు రాహుల్ గాంధీ. తన ప్రసంగంతో పార్లమెంట్ దద్దరిల్లిపోతుందన్నారు.అందుకే ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అధికారపక్షం అడ్డుకుంటోందన్నారు. పెద్దనోట్ల రద్దు అనేది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమన్నారు. ఆ విషయాన్ని పార్లమెంట్‌లో బయటపెడుతామన్నారు.
ప్రధానమంత్రి దేశం మొత్తం తిరిగి ప్రసంగాలు ఇస్తున్నారు గానీ, లోక్‌సభకు వచ్చేందుకు మాత్రం భయపడుతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఆయనకు ఇంత భయం ఎందుకని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు మీద చర్చించడానికి తాము దాదాపు నెల రోజుల నుంచి ప్రయత్నిస్తున్నామని.. ఛాన్సిస్తే దులిపేస్తామని చెబుతున్నారు.