మోడీ కాకుంటే అత‌డే ఆప్ష‌న్‌..తేల్చిన స‌ర్వే!

Update: 2018-08-22 04:48 GMT
ప్ర‌ధాన‌మంత్రిగా ఎవ‌రు ఉండాల‌ని భావిస్తున్నారు? అన్న సూటిప్ర‌శ్న‌కు అంతే క్లారిటీగా మోడీనే అని చెబుతున్న వారి సంఖ్య ఇప్ప‌టికి మెజార్టీగా ఉంద‌న్న విష‌యం తాజా స‌ర్వే స్ప‌ష్టం చేసింది. మూడ్ ఆఫ్ ద నేష‌న్ పేరుతో నిర్వ‌హించిన స‌ర్వే ఫ‌లితాన్ని తాజాగా ఇండియా టుడే వెల్ల‌డించింది. గ‌త నెల‌లో దేశ వ్యాప్తంగా నిర్వ‌హించిన ఈ స‌ర్వే ఫ‌లితాన్ని తాజాగా  ఆ సంస్థ విడుద‌ల చేసింది.

ప్ర‌ధాని ప‌ద‌వికి ఎవ‌రు అర్హుల‌న్న మాట‌కు  49 శాతం మంది మోడీకే ఓటు వేయ‌టం గ‌మ‌నార్హం. మోడీ త‌ర్వాతి స్థానం రాహుల్ కు ద‌క్కింది. ఆయ‌న్ను ప్ర‌ధాని కావాల‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేసిన వారు 27 శాతం మంది మాత్ర‌మే. ప్ర‌ధాని కుర్చీలో కూర్చోవ‌టానికి వీలుగా పావులు క‌దుపుతున్నార‌న్న పేరున్న ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని కేవ‌లం 8 శాతం మంది మాత్ర‌మే కోరుకోవ‌టం గ‌మ‌నార్హం.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ప్ర‌ధానిగా మోడీ కాకుండా ఆయ‌న‌కు ప్ర‌త్యామ్నాయం ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు స‌ర్వేలో పాల్గొన్న వారంతా రాహుల్ గాంధీ వైపు మొగ్గారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీకి స‌రైన ప్ర‌త్యామ్నాయం ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు రాహుల్ గాంధీ అన్న మాట‌ను 46 శాతం మంది చెప్ప‌టం చూస్తే.. మోడీకి ప్ర‌త్యామ్నాయంగా రాహుల్ గా భావించ‌టం క‌నిపిస్తుంది. సో.. మోడీకి ప్ర‌త్యామ్నాయం రాహులేన‌న్న విష‌యంలో ప్ర‌జ‌ల‌కు క్లారిటీ వ‌చ్చేసింద‌న్న విష‌యాన్ని తాజా స‌ర్వే స్ప‌ష్టం చేసిన‌ట్లే.
Tags:    

Similar News