రాహుల్ గాంధీ మంచి కంటెంట్ వదిలాడు ...

Update: 2022-05-09 04:46 GMT
రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణా టూర్ పూరిగా సక్సెస్ అయింది అని చెప్పాలి. రాహుల్ గాంధీ మొత్తానికి మొత్తం అన్నీ కవర్ చేశాడు. అంతే కాదు అటు రైతులకు ఇటు ప్రజలకు చెప్పాల్సింది చెప్పాడు. మరో వైపు పార్టీ వారికి కూడా ఎలాంటి హెచ్చరికలు చేయాలో అన్నీ చేశాడు. ఇవన్నీ చూస్తే రాహుల్ టూర్ పూర్తిగా సక్సెస్ అయిందనే అంటున్నారు. ఇక రాహుల్ గాంధీ తెలంగాణా టూర్ తరువాత పార్టీకే ఫుల్ జోష్ వచ్చేసింది.

రాహుల్ గాంధీ మీటింగ్ ధూం ధాం గా జరిగింది. సక్సెస్ అయింది. దాంతో పాటు రైతులకు వరాలు ఇచ్చారు. అలాగే  తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం గ్యారంటీ అని కూడా ఆయన ప్రజలకు ఉత్తేజపరచగలిగారు. ఇక రెండవ రోజు ఆయన జైలు కి వెళ్ళి స్టూడెంట్స్ కలవడం, అలాగే గాంధీ భవన్ లో అందరినీ కలసి మాట్లాడడం, మొదటి రోజు మీటింగులో సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం ఇలా చాలా జరిగిపోయాయి.

ఇక కాంగ్రెస్ లోనే ఉంటూ టీయారెస్, బీజేపీలతో లోపాయికారి ఒప్పందాలను చేసే వారు పార్టీలో ఉండవద్దు అని రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం, అలాంటి వారు కాంగ్రెస్ కి పనికిరారు అని రాహుల్ చేప్పడంతో చాలా మంది నాయకుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి.  ఎందుకంటే కాంగ్రెస్ లో ఉంటూ టీయారెస్ కి అనుకూలంగా పనిచేసే వారి లిస్ట్ ఇపుడు  హై కమాండ్ దగ్గర ఉందంట.

కొందరు నేతలకు అయితే టీయారెస్ వారు నెల జీతాలు ఇస్తూ టీపీసీసీ ఛీఫ్   రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రెస్ మీట్లు పెట్టించడం వంటివి చేస్తున్నారు అన్న సమాచారం కూడా హై కమాండ్ వద్ద ఉందిట.  అందుకే కాంగ్రెస్ నేతలు ఎవరూ ప్రెస్ మీట్లలో మాట్లాడవద్దు అని రాహుల్ గాంధీ పబ్లిక్ మీటింగులోనే చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చారు అంటున్నారు.

ఇక పోతే రెండవ రోజు గాంధీ భవన్ లో జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్ నాయకులు ఇలా చాలామందితో రాహుల్ సమావేశమైనపుడు మీరు ఎవరూ  ఢిల్లీ రావద్దు, ప్రజలతో ఉంటేనే సీట్లూ అవే వస్తాయన్న సత్యాన్ని కచ్చితంగా చెప్పేశారు అంటున్నారు. చాలా మంది నాయకులు ఢిల్లీలో లాబీయింగ్ చేసి టికెట్లు తెచ్చుకుందామనుకుంటున్నారు కానీ ప్రజలతో ఉంటేనే సీట్లు అవే వస్తాయి. కాంగ్రెస్ పార్టీ కూడా సర్వే చేసి ఆ నివేదిక ప్రకారమే సీట్లు ఇస్తుందని రాహుల్ కచ్చితంగా చెప్పేశారు.

గెలిచే వాళ్ళకే పార్టీ సీట్లు ఇస్తుందని కూడా రాహుల్ క్లారిటీగా చెప్పేశారు. దాంతో పార్టీ కోసం నికరంగా పనిచేసే వారు, పద్ధతిగా ఉండేవారికి రాహుల్ మాటలు బాగా నచ్చేశాయి. అదే టైమ్ లో కొందరు సీనియర్ నాయకులకు ఆయన మాటలు నచ్చడంలేదు అంటున్నారు ఎందుకంటే వారు షో మాస్టర్లు కాబటే రాహుల్ హితవు వారికి నచ్చడంలేదు అంటున్నారు.

ఇక రైతుల డిక్లరేషన్ ప్రతిని  తెలంగాణాలోని ప్రతీ రైతు  ఇంటికీ వెళ్ళి వారికి ఇచ్చి అందులోని సారాంశాన్ని వారికి అర్ధమయ్యేలా చెప్పాలని, ఆ విధంగా ఇంటింటికీ తిరగాలని రాహుల్ దిశానిర్దేశం చేశారు. అంటే ఇక మీదట కాంగ్రెస్ వాళ్ళు అంతా గాంధీ భవన్ వీడి ఇంటింటికీ తిరగాలి అన్న మాట. మొత్తానికి చూస్తే రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణా టూర్ ఫుల్ జోష్ ని పార్టీకి నేతలకు ఇచ్చింది అని చెబుతున్నారు.
Tags:    

Similar News