కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడంతా రాహుల్ మేనియా నడుస్తున్న సంగతి తెలిసిందే. యువరాజు తమ పార్టీకి త్వరలోనే అధ్యక్షుడు కాబోతున్నాడని హస్తం పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ముహూర్తం దగ్గరపడుతున్న కొద్దీ వారిలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అయితే ఈ సంబరాలకు ముందే..రాహుల్ కు, ఆయన టీంకు గట్టి షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఘోర అవమానం జరిగింది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పేలవ ప్రదర్శన కనబరిచింది. ఇదంతా పార్టీ పరంగా చూడాలని అనుకుంటున్నప్పటికీ... సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వంత పార్లమెంటరీ నియోజకవర్గమైన అమేథీలోనూ హస్తం పార్టీ బోల్తా కొట్టింది.
తాజాగా వెలువడిన ఫలితాల్లో...అమేథీ నగర పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న అమేథీలో బీజేపీ విజయం సాధించడంతో సీనియర్ నేతలందరూ షాక్ అవుతున్నారు. తమ పార్టీకి భవిష్యత్ నాయకుడిగా భావిస్తుంటే..ఆయన పట్టాభిషేకానికి ముందే..పార్టీ ఇలా బోల్తా కొట్టడం ఏంటని వాపోతున్నారు. ఇలాగైతే తాము ఏ భరోసాతో ముందుకు సాగాలని ప్రశ్నిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ పేలవ షో పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కామెంట్ కూడా చేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భారీ ప్రసంగాలు ఇస్తున్న రాహుల్.. తన స్వంత నియోజకవర్గంలో గెలవలేకపోయారని సీఎం యోగి విమర్శించారు. అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థి చంద్రమా దేవి మేయర్‌గా గెలిచారు.
కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ తన హవా కొనసాగిస్తోంది. బీజేపీ మొత్తం 16 పురపాలక స్థానాలకుగాను 14 స్థానాల్లో విజయఢంకా మోగించింది. అయోధ్యలో మొత్తం 60 వార్డుల్లో బీజేపీ 32 స్థానాలు గెలుచుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నది. అయోధ్యలో ఎస్పీ 17 - బీఎస్పీ 2 - కాంగ్రెస్ 1 - ఇతరులు 8 గెలుచుకున్నాయి.
వారణాసి (16 స్థానాలు) - గోరఖ్ పూర్ (27 స్థానాలు) - ఘజియాబాద్(11 స్థానాలు) - బరేలీ (12 స్థానాలు) - ఆగ్రా (8 స్థానాలు) - ఫిరోజాబాద్ (5 స్థానాలు) - మధుర (24) - లక్నో (5 స్థానాలు) - కాన్పూర్ (67 స్థానాలు) - శహరన్ పూర్ (13 స్థానాలు) - మొరాదాబాద్ (19) - అలీఘడ్ (25 స్థానాలు) - మీరట్ (14) స్థానాల్లో గెలుపొంది మేయర్ పీఠాలను కైవసం చేసుకుంది. మెజార్టీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో యూపీలోని బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ నేతలు సంబురాలు జరుపుకుంటున్నారు.