కొడుకుగా ఎందుకు రియాక్ట్ కాలేవు రాహుల్‌?

Update: 2016-03-03 09:30 GMT
దేశంలో ఏం జ‌రిగినా నేను ఉన్నానంటూ రియాక్ట్ అయ్యే కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ.. ఒక విష‌యంలో మాత్రం తాను స‌మాధానం చెప్ప‌లేన‌ని చెబుతున్నారు. అమాయ‌కుల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన అఫ్జ‌ల్ గురు సంస్మ‌ర‌ణ స‌భ‌ను నిర్వ‌హించిన హెచ్‌ సీయు విద్యార్థుల్లో ఒక‌రైన రోహిత్ ఆత్మ‌హ‌త్య చేసుకుంటే.. అక్కెడెక్క‌డో ఢిల్లీలో ఉండే రాహుల్‌.. ప‌రుగుప‌రుగున హెచ్‌ సీయూకి రావ‌టం.. ఆ ఇష్యూను దేశవ్యాప్తంగా చ‌ర్చ‌కు పెట్ట‌టం తెలిసిందే.

దేశంలో ఎక్క‌డైనా ఏదైనా స‌మ‌స్య ఎదురైతే ఒక నేత‌గా స్పందించ‌టం త‌ప్పేం కాదు. కానీ.. రోహిత్ ఉదంతంతో త‌న ప్ర‌త్య‌ర్థి.. కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీని దెబ్బ తీసే అవ‌కాశం ల‌భించ‌టంతో చెలరేగిపోయి.. స్పీచ్ ల మీద స్పీచ్ లు ఇచ్చిన రాహుల్‌.. తాజాగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత తీసుకున్న ఒక నిర్ణ‌యంపై నోరు విప్పేందుకు కిందామీదా ప‌డుతున్నారు.

త‌న తండ్రి రాహుల్ గాంధీని దారుణంగా చంపేసిన హంత‌కుల్ని తాజాగా విడిచిపెట్టాల‌ని జ‌య‌ల‌లిత స‌ర్కారు నిర్ణ‌యించ‌టం.. దీనిపై స్పందించాల‌ని కోరిన‌ప్పుడు రాహుల్ నోరు విప్పేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. కొడుకుగా తాను ఈ విష‌యం మీద మాట్లాడ‌లేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.

రాహుల్ హ‌త్య కేసులో దోషులైన ఏడుగురు హంత‌కులు 24 ఏళ్లుగా జైల్లో ఉన్నార‌ని.. వారిని విడుద‌ల చేయాల‌ని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత నిర్ణ‌యం తీసుకొని.. కేంద్ర స‌ర్కారు నిర్ణ‌యం చెప్పాల‌ని కోర‌టం తెలిసిందే. ఈ ఉదంతంపై తాను ఏమీ మాట్లాడ‌లేన‌ని చెబుతున్నారు. దేశంలో ప్ర‌తి విష‌యంపైనా స్పందించే రాహుల్‌.. త‌న తండ్రి హంతుకుల‌ను విడుద‌ల చేసే విష‌యం ఏమీ ఎందుకు స్పందించ‌రు? ఆయ‌న ఆ విష‌యం మీద త‌న వాద‌న ఎందుకు వినిపించ‌రు? అన్న ప్ర‌శ్న‌ల‌కు అయినా స్ప‌ష్టంగా స‌మాధానం ఇస్తే బాగుంటుంది.
Tags:    

Similar News