అవకాశాలు అన్నిసార్లు రావు. వచ్చినప్పుడు పూర్తిగా వినియోగించుకోవాలి. లడ్డూ లాంటి ఛాన్స్ చేతికి చిక్కితే మంచి ఆకలి మీద ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తినే ఉంటారా? తనకొచ్చిన ఛాన్స్ ను పూర్తి స్థాయిలో వాడుకోవటమే కాదు.. టైమ్లీ పంచ్ ను విసిరారు.
గడ్కరీ మీద పొగడ్త విసిరిన రాహుల్ ట్వీట్.. కమలనాథులకు కరెంట్ షాక్ కొట్టినట్లైంది. తమ నోటి నుంచి మాటలకు రాహుల్ వేసిన కౌంటర్ అదిరిపోయేలా ఉండటమే కాదు.. కమలనాథులు డిఫెన్స్ లోపడేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం విలేకరులతో మాట్లాడిన కేంద్ర మంత్రి గడ్కరీ.. రిజర్వేషన్లకు సంబంధించిన వచ్చిన ఒక ప్రశ్నకు స్పందిస్తూ.. అసలు దేశంలో ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఉద్యోగాలే లేనప్పుడు ఇక రిజర్వేషన్లు ఎందుకు? అంటూ అనకూడని మాటను తనదైన మాటలతో అనేశారు.
అక్కడితో ఆగని ఆయన.. రిజర్వేషన్లు ఇచ్చారనే అనుకుందాం.. కానీ ఉద్యోగాలు లేవు. ఎందుకంటే బ్యాంకుల్లో ఐటీ కారణంగా ఉద్యోగాలు లేవు.. తగ్గిపోయాయి.. ప్రభుత్వ నియామకాలు స్తంభించాయి.. అందువల్ల రిజర్వేషన్లు ఉన్నంత మాత్రానికే ఉద్యోగానికి భరోసా.. హామీ ఉండదనేశారు.
గడ్కరీ నోటి నుంచి ఇంత పెద్ద మాట వస్తే రాహుల్ ఊరుకుంటారా? గడ్కరీ నోటి మాటలు తెలిసిన వెంటనే ఆయన ట్వీట్ చేశారు. ఎక్స్ లెంట్ క్వశ్చన్ గడ్కరీ జీ.. ప్రతి భారతీయుడు ఇదే ప్రశ్నను అడుగుతున్నారంటూ ట్వీట్ పంచ్ తో మోత మోగించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం రిజర్వేషన్ల కోసం ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. అసలు ఉద్యోగాలు ఎక్కడున్నాయ్? అంటూ చేసిన వ్యాఖ్య రిజర్వేషన్ల విషయాన్ని పక్కన పెట్టి.. మోడీ సర్కారు వైఫల్యాన్ని కేంద్రమంత్రే తన మాటతో ఒప్పుకున్నట్లుగా మారిందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని గుర్తించే.. సరైన సమయంలో స్పందించిన రాహుల్.. తన ట్వీట్ తో పంచ్ వేయటమే కాదు.. వేర్ ఆర్ ద జాబ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు. ఇదిప్పుడు వైరల్ గా మారింది.