మునుగోడు ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు అందరిని తొలిచేస్తుంది. గెలుపు మీద ధీమాను అధికారపక్షం టీఆర్ఎస్.. విపక్షాలు బీజేపీ.. కాంగ్రెస్ లు వ్యక్తం చేస్తున్నా.. పోటీ మాత్రం టీఆర్ఎస్ - బీజేపీ మధ్యనే నడుస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
దీనికి కారణం.. పోటాపోటీగా నేతల్ని మొహరించటం మొదలు ధన బలాన్ని ప్రదర్శించాలన్నా.. మద్యంతో పాటు చికెన్.. మటన్ ను పంపిణీ చేయాలన్నా టీఆర్ఎస్.. బీజేపీలు ఒకటి దానికి ధీటుగా మరో పార్టీ చేసిందని చెబుతున్నారు. దీంతో.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇలాంటి విషయాల్లో దూకుడు ప్రదర్శించలేకపోయిందని చెబుతున్నారు.
ఇలాంటి వేళలో.. ఈ ప్రతిష్టాత్మక ఉపపోరులో కాంగ్రెస్ కు అవకాశాలు చాలా తక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మునుగోడు ఉప ఎన్నిక ఆరంభం నుంచి వినిపించిన మాట.. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అయితే మూడో స్థానంలో నిలుస్తుందో.. ఆ పార్టీకి జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే.. బీజేపీ సంగతి ఎలా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది వర్తించదని చెబుతున్నారు. కారణం..పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీగా చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర సరిగ్గా మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు కాస్త ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించటం కాంగ్రెస్ కు వరంగా మారినట్లుగా చెప్పాలి. ఎందుకంటే.. పార్టీకి చెందిన కీలక నేతలు.. క్యాడర్ మొత్తం రాహుల్ వెంట ఉండటంతో.. మునుగోడుకు ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోయారు.
దీంతో.. ఉప ఎన్నిక ఫలితం తేడా కొట్టినా కాంగ్రెస్ కు జరిగే నష్టం తక్కువే అన్న మాట వినిపిస్తోంది. ముఖ్యనాయకుడి పాదయాత్ర కారణంగా మునుగోడు మీద ఎక్కువ ద్రష్టి పెట్టలేదన్న వాదనకు తగ్గట్లే.. నేతల తీరు ఉందని చెప్పాలి.
చాలామంది కాంగ్రెస్ నేతలు ఉదయం రాహుల్ పాదయాత్రలో పాల్గొని.. సాయంత్రం బయలుదేరి రాత్రికి మునుగోడుకు చేరుకొని.. అక్కడ ప్రచారం చేసిన వైనం తెలిసిందే. నిజానికి రాహుల్ పాదయాత్ర లేకపోతే.. మునుగోడు ఫలితం కాంగ్రెస్ కు కరెంటు షాక్ మాదిరి మారేదని.. రాహుల్ ఇప్పుడు వారికి సేవియర్ గా మారారన్న మాట వినిపిస్తోంది. రాహుల్ పాదయాత్ర కారణంగా తెలంగాణ కాంగ్రెస్ కు తనను తాను నిరూపించుకునే మరో అవకాశం లభించినట్లైందని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.