ఈ స్కెచ్ తో..ఏపీ మ‌న‌సు గెలుచుకోవ‌చ్చు రాహుల్‌!

Update: 2018-07-19 12:35 GMT
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్‌ సభలో చర్చ జరగనున్న సంగ‌తి తెలిసిందే. చర్చ తర్వాత ఓటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఏపీ ప్ర‌భుత్వం పెట్టిన అవిశ్వాసం అయిన‌ప్ప‌టికీ దేశం చూపు తెలుగునేల‌పై రాజ‌కీయం చేసే  ప్ర‌ధాన పార్టీల‌పై ప‌డింది. అవిశ్వాసం పెట్టింది టీడీపీ కావ‌డం - కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాగు విశ్వాస ప‌రీక్ష‌ను ఎదుర్కుండ‌టంతో...వైసీపీకి స‌భ్యులపై అన‌ర్హ‌త వేటుప‌డ‌టంతో అంద‌రి చూపు కాంగ్రెస్ పార్టీపై ప‌డింది. ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో...ఆ పార్టీపై విభ‌జ‌న తాలుకు ఆగ్ర‌హం కాస్త చల్లారిన‌ట్లే అయింది. ఇదే ఊపులో ఆ పార్టీ ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకునే అవ‌కాశం ద‌క్కింద‌ని అంటున్నారు.

శుక్రవారం లోక్‌ సభలో జరగనున్న అవిశ్వాస తీర్మాన చ‌ర్చ‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. ఈ అంశం గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీకి గంట సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి రాహుల్ నేతృత్వం వహించే అవకాశాలున్నాయి. చర్చ సమయంలో ప్ర‌ధాని మోడీపై రాహుల్ ఫైర్ అయ్యే ఛాన్సుందని స‌మాచారం. కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు ఇతరులు కూడా మాట్లాడనున్నారు. బీజేపీపై ఎన్నికల అస్ర్తాన్ని సంధించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస అంశంపై రాహుల్‌ తో మాట్లాడించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ సంద‌ర్భంగా ఏపీ విభ‌జ‌న‌కు తామెందుకు సిద్ధ‌ప‌డింది - విభ‌జ‌న చ‌ట్టంలో ఏయే అంశాల‌ను పేర్కొంది రాహుల్ విపుల‌తంగా తెలియ‌జెప్ప‌నున్న‌ట్లు స‌మాచారం. గంట‌పాటు మాట్లాడే రాహుల్ ఈ క్ర‌మంలో బీజేపీ 2014లో ఇచ్చిన హామీల‌పై గ‌లం విప్పే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏపీ ప్ర‌జ‌ల్లో పాజిటివ్ ఫీలింగ్ క‌లిగించేందుకు - కాంగ్రెస్ బ‌ల‌ప‌డేందుకు ఈ అవ‌కాశాన్ని రాహుల్ గాంధీ ఉప‌యోగించుకుంటార‌ని ఆ పార్టీ నాయ‌కులు చెప్తున్నారు.
Tags:    

Similar News