రైల్వే బడ్జెట్ లో ప్రయాణికులకు సరికొత్త ఆఫర్

Update: 2016-02-24 04:24 GMT
మరో రోజులో రైల్వే బడ్జెట్ బయటకు రానుంది. అయితే.. ఆ బడ్జెట్ లో ఉండే కొన్ని ప్రధాన అంశాల మీద కొన్ని అంచనాలు వినిపిస్తుంటాయి. అదే సమయంలో వినూత్నంగా చేపట్టే కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు లీలగా బయటకు వస్తుంటాయి. తాజాగా అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. ఈసారి రైల్వే బడ్జెట్ లో ప్రయాణికులకు వినూత్న ఆఫర్ ను రైల్వే మంత్రి ప్రకటించే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.

రైల్వే ప్రయాణంలో ప్రయాణికులు.. తాను ప్రయాణం చేస్తున్న మార్గమధ్యంలోని ఏదైనా హోటల్ భోజనం కావాలన్న విషయాన్ని ముందస్తుగా తెలియజేసే అవకాశాన్ని కల్పించటంతో పాటు.. సదరు హోటల్ భోజనం ప్రయాణికుడికి అందే కొత్త విధానాన్ని రైల్వే మంత్రి ప్రకటించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. రిజర్వ్ టిక్కెట్ల మీద ఈ సౌకర్యాన్ని కల్పించనున్నారు.

ప్రయాణికుడికి నచ్చిన హోటల్ భోజనం అందించే ఏర్పాటును ఐఆర్ సీటీసీకి అప్పగిస్తారని చెబుతున్నారు. ఐఆర్ సీటీసీ అంతర్గత సామర్థ్యాన్ని గరిష్ఠంగా వినియోగించుకోవటంతోపాటు.. దాని సేవలు విస్తృతం చేసే అవకాశం ఉందంటున్నారు. తాజా ఆఫర్ కానీ నిజమైన పక్షంలో ప్రయాణికులకు తీపికబురు కావటం ఖాయం.
Tags:    

Similar News