జీఎస్టీ అంటే పన్ను కాదు, పాప

Update: 2017-07-02 08:15 GMT
కోట్లాది మంది దేవుడిగా కొలిచే సచిన్ అంటే అభిమానంతో ఆయన పేరును తమ పిల్లలకు పెట్టుకున్నవారున్నారు. రాజకీయ నేతలంటే అభిమానంతో ఇందిరా - రాజీవ్ - ఎన్టీఆర్ - రాజశేఖరరెడ్డి వంటి పేర్లు పెట్టుకున్నవారూ ఉన్నారు. స్వాతంత్ర్య సమరయోధులంటే ఇష్టంతో భగత్ సింగ్ - సుభాష్ చంద్రబోస్ - గాంధీ - నెహ్రూ వంటి పేర్లూ దేశవ్యాప్తంగా వేలాదిమందికి ఉన్నాయి. దేవుళ్ల పేర్లు పెట్టుకునేవారు కోకొల్లలు. అయితే... ఇలా మనుషుల పేర్లు - దేవుల పేర్లు పెట్టుకోవడం తెలుసుకానీ.. ఇప్పుడు ఏకంగా ఒక పాపకు ఓ ట్యాక్స్ పేరు పెట్టారు. అది నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) పేరు.
    
అవును.. జీఎస్‌ టీ అమల్లోకి వచ్చిన రోజునే ఆ పాప పుట్టడంతో ఆమెకు ‘జీఎస్‌ టీ’ అని పేరు పెట్టుకున్నారా తల్లిదండ్రులు. రాజస్థాన్‌ లో జరిగిందీ ఘటన. రాజస్థాన్ లోని బీవర్‌ ఆసుపత్రిలో జూన్ 30 అర్ధరాత్రి దాటిన తరువాత జులై 1వ తేదీ ప్రారంభమైన తరువాత ఓ మహిళ  12.02 నిమిషాలకు పండంటి పాపాయికి జన్మనిచ్చింది. అప్పుడే జీఎస్‌ టీ కూడా దేశంలో ప్రారంభమైంది.
    
దీంతో పాపకు జీఎస్‌ టీ అని పేరు పెట్టుకోవాలని ఆ తల్లి నిర్ణయించింది. అంతేకాదు... జీఎస్‌ టీని(పాప) ఎత్తుకొని సెల్ఫీలు కూడా దిగింది. సో... జీఎస్టీ అంటే ఇప్పుడు కేవలం పన్నే కాదు, పాప కూడా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News