తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసేలా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం చేస్తారన్న వాదన జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయం మీద రజనీ ఇప్పటివరకూ సూటిగా చెప్పింది లేదు. దేవుడు ఆదేశిస్తే.. తానేం చేయటానికైనా సిద్ధమన్న ఆయన.. దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటానని చెప్పారు. ఈ ప్రకటనతో రజనీ పొలిటికల్ ఎంట్రీ మీద భారీ ఎత్తున చర్చ నడుస్తోంది.
ఈ చర్చ ఇలా సాగుతున్న వేళలోనే..రజనీ తన దారిన తాను ముంబయిలో కాలా చిత్ర షూటింగ్ కు వెళ్లిపోయారు. ఆయన ఒకపక్క షూటింగ్ లో బిజీగా ఉన్న వేళలోనే.. ఆయనకు సంబంధించిన చాలా విషయాలు వార్తల రూపంలో వచ్చాయి. రానున్న రోజుల్లో మరోసారి రజనీ తన అభిమానుల్ని కలుసుకుంటారని.. మొన్నటి మాదిరే ఫ్యాన్స్ తో ఫోటోలు దిగుతారంటూ వార్తలు వచ్చాయి. నిజమో కాదో అన్న సందేహాల నడుమ ఈ వార్తలపై విస్తృత చర్చ సాగుతోంది. అభిమానులతో మరోసారి భేటీ అంటే.. అది కచ్ఛితంగా రాజకీయ దిశగా అడుగులు వేయటమేనన్న వాదన వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. తాజాగా కాలా షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని ముంబయి నుంచి చెన్నైకి వచ్చారు రజనీ. ఈ సందర్భంగా చెన్నై ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడారు కబాలి. సాధారణంగా ఆచితూచి మాత్రమే మాట్లాడే ఆయన ఈసారి కూడా ఇదే తీరులో వ్యవహరించారు.
కాలా షూటింగ్ బాగా జరిగిందని చెప్పిన ఆయన.. రెండో షెడ్యూల్ ను ఈ నెల 24 నుంచి చెన్నైలో జరగనున్నట్లుగా వెల్లడించారు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర ముచ్చటను చెప్పారు. రెండు నెలల వ్యవధిలో మరోసారి అభిమానులతో కలిసి గడపనున్నట్లుగా ఆయన చెప్పారు. ఈ మధ్యన ఐదు రోజుల పాటు ఫ్యాన్స్ తో ఫోటోలు తీసుకునేందుకు సమయాన్ని కేటాయించిన రజనీ.. రెండు నెలల వ్యవధిలోనే మరోసారి అభిమానుల్ని కలుస్తానని చెప్పటంతో.. ఆయన పొలిటికల్ ఎంట్రీ మీద తీవ్రంగా కసరత్తు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో రెండు నెలల వ్యవధిలోనే ఫ్యాన్స్‌ను కలవనున్నట్లు స్వయంగా ప్రకటించటం ఆయన అభిమానులకు తీపికబురుగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/